'రావణాసుర'లో యంగ్‌ హీరో.. ఇంటెన్సివ్‌గా ఫస్ట్‌ లుక్‌ | Akkineni Sushanth First Look Out From Ravanasura Movie | Sakshi
Sakshi News home page

Akkineni Sushanth: 'రావణాసుర'లో యంగ్‌ హీరో.. ఇంటెన్సివ్‌గా ఫస్ట్‌ లుక్‌

Published Tue, Jan 11 2022 8:18 PM | Last Updated on Tue, Jan 11 2022 8:19 PM

Akkineni Sushanth First Look Out From Ravanasura Movie - Sakshi

Akkineni Sushanth First Look Out From Ravanasura Movie: మాస్‌ మహారాజ రవితేజ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఖిలాడీ, రామారావు ఆన్‌ డ్యూటీతోపాటు డైరెక్టర్‌ సుధీర్‌ వర్మతో 'రావణాసుర' చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయగా జనవరి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లకు సూపర్‌ రెస్పాన్స్ వచ్చింది. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా, శ్రీకాంత్‌ విస్సా కథ అందించారు. ఈ సినిమాలో రవితేజ లాయర్‌ పాత్రతో పాటు పది గెటప్‌లలో అలరించనున్నాడని టాక్‌ వినిపిస్తోంది. పలు ఆసక్తికర అంశాలతో మూవీ అప్‌డేట్స్‌ ఇస్తున్నారు మేకర్స్‌.

తాజాగా ఈ సినిమాలోని మరో పాత్రను పరిచయం చేసింది చిత్రబృందం. ఇందులో యంగ్‌ హీరో అక్కినేని సుశాంత్‌ కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌.. రామ్‌ పాత్రలో అలరించనున్నట్లు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఆ ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే సుశాంత్‌ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రెడ్‌ అండ్‌ బ్లాక్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో లాంగ్‌ హెయిర్‌తో ఇంటెన్సివ్‌ లుక్‌లో కనిపించాడు సుశాంత్‌. ఈ లుక్‌ చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మూవీలో అందాల తార దక్షా నాగర్కర్‌ విలన్‌గా చేయనున్నట్లు కూడా టాక్ వినిపించింది. ఈ సినిమా గురించి ఇంకెన్ని ఆసక్తికర విషయాలు రివీల్‌ చేస్తారో చూడాలి. 
 


ఇదీ చదవండి: లాయర్‌గా రవితేజ సందడి.. విలన్‌గా అందాల తార ఢీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement