
చైతూ పాత్రే మలుపు తిప్పుతుందట..
చాలా గ్యాప్ తర్వాత అక్కినేని హీరో సుశాంత్ 'ఆటాడుకుందా రా..' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాలో నాగచైతన్య, అఖిల్.. ఇద్దరూ మెరిసి అభిమానులను ఖుష్ చేయనున్నారు. వీరిలో చైతూ పాత్ర కథకు కనెక్ట్ అయ్యి ఉంటుందని టాక్.
చైతన్య పాత్రతోనే కథ ఊహించని మలుపు తిరుగుతుందట, ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారని చెబుతోంది చిత్ర యూనిట్. యాక్షన్ ఎంటర్టెయినర్గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 19 న విడుదల కానుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సుశాంత్ సరసన సోనమ్ బజ్వా కథానాయికగా నటిస్తోంది. సినిమా విజయంపై సుశాంత్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.