హీరో అక్కినేని నాగార్జున 'బిగ్‌బాస్'తో పాటు ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అతడి సోదరి నాగసుశీలపై పోలీస్ కేసు నమోదైందనే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే కొడుకుని హీరోగా పెట్టి పలు చిత్రాల్ని నిర్మించిన ఈమెపై ఎవరు కేసు పెట్టారు? అయినా ఎందుకు పెట్టారు?
నాగార్జున చెల్లెలు నాగసుశీల. ఈమె కొడుకే నటుడు సుశాంత్. గతంలో తెలుగులో పలు సినిమాల్లో హీరోగా చేశాడు. కొన్నాళ్ల నుంచి మాత్రం అల వైకుంఠపురములో, రావణాసుర, భోళా శంకర్ తదితర చిత్రాల్లో కీలకపాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. గతంలో ఇతడిని హీరోగా పెట్టి.. తల్లి నాగసుశీల 'కరెంట్', 'అడ్డా', 'ఆటాడుకుందాం రా' తదితర చిత్రాల్ని నిర్మించారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్)
ఈమె చింతలపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తితో కలిసి సినిమాలు నిర్మించారు. అలాంటిది 2019లో నాగసుశీలనే అతడిపై పోలీస్ కేసు పెట్టారు. అప్పట్లో వీళ్లిద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. తనకు తెలియకుండా శ్రీనివాసరావు.. భూముల్ని అమ్మేసుకుని, ఆ డబ్బు దుర్వినియోగం చేశాడని ఈమె ఆరోపణలు చేశారు.
అలాంటిది ఇప్పుడు అదే శ్రీనివాసరావు.. నాగసుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఈమెతోపాటు మరో 12మంది కలిసి తనపై దాడి చేశారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గత నాలుగేళ్లుగా వీళ్లిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అదికాస్త మరోసారి కేసుల వరకు వెళ్లడం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా అయిపోయింది.
(ఇదీ చదవండి: అసిస్టెంట్ పెళ్లిలో స్టార్ హీరో సందడి.. వీడియో వైరల్!)
Comments
Please login to add a commentAdd a comment