Sushanth Anumolu Will Acts Guest Role in Chiranjeevi Bhola Sankar's Movie - Sakshi
Sakshi News home page

భోళాశంకర్‌ మూవీలో సుశాంత్.. ఆ పాత్ర కోసమేనట!

Published Sat, Mar 18 2023 3:21 PM | Last Updated on Sat, Mar 18 2023 4:16 PM

Sushanth Anumolu Will Acts Guest Role In Chiranjeevi Bhola Sankar Movie - Sakshi

చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత  ఖైదీ నెంబర్ 150 మినహాయిస్తే ప్రతి సినిమాలో యంగ్ హీరో సపోర్ట్ తీసుకుంటున్నాడు.సైరా సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తే... ఆచార్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ నటించాడు. ఇక గాడ్‌ ఫాదర్ సత్యదేవ్‌ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. చిరంజీవి స్టామినా ఎంటో బాక్సాఫీస్‌కి చూపించిన వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించాడు మెగాస్టార్. ఈ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా భోళా శంకర్. ఈ సినిమాలో కూడా ఓ యంగ్ హీరో నటించనున్నాడు. ఈ ఛాన్స్‌ అక్కినేని హీరో దక్కించుకున్నాడు. 

వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత చిరంజీవికి.. ప్రేక్షకులు తన నుంచి  ఏమి కోరుకుంటున్నారో బాగా అర్థమైనట్లుంది. అందుకే తను మెహర్ రమేష్‌ దర్శకత్వంలో నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండే విధంగా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ కావటంతో.. భోళాశంకర్‌పై హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా తమిళ్‌ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాలో చిరు తనదైన స్టైల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఖుషి సినిమాలోని ఇంటర్వెల్ సీన్‌ను చిరంజీవి- శ్రీముఖి మధ్య రీ క్రియేట్ చేసి షూట్ చేసినట్లు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే చూడాలని ఉంది సినిమాలోని రామ్మా చిలకమ్మ హిట్ సాంగ్‌ను కూడా భోళాశంకర్‌లో రీమిక్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. సిస్టర్‌గా కీర్తి సురేశ్ కనిపించనుంది. 

అలాగే ఈ సినిమాలో చిరంజీవి మరో యంగ్ హీరోతో కలిసి సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సారి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం అక్కినేని హీరో సుశాంత్‌కు దక్కింది.  కాళిదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్.. ప్రజెంట్ హీరోగా సినిమాలు చేస్తూనే.. ప్రత్యేక పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. అలా వైకుంఠపురంలో సినిమాలో నటించిన సుశాంత్  నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఇలా తనదైన పాత్రలు చేస్తూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న సుశాంత్ రవితేజ రావణసుర మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్‌లో రోల్‌ చేయనున్నారు. రావణసుర సినిమాలో రవితేజతో పాటు.. సుశాంత్ రోల్ కూడా కీలకంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. 

తాజాగా చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్‌లో సుశాంత్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేశ్ లవర్‌గా సుశాంత్ కనిపించబోతున్నాడట. అయితే వేదాళం మూవీలో ఈ క్యారెక్టర్ చాలా చిన్నగా ఉంటుంది. అయితే తెలుగులో సుశాంత్ కోసం ఈ పాత్ర లెంగ్త్ కొంచెం పెంచారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సుశాంత్ ఈ మూవీలో నటించేందుకు ఓకే చెప్పాడట.

 ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని టాక్ వినిపిస్తోంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టులో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే చిరంజీవి సినిమాలో సుశాంత్ నటించనున్నాడనే విషయం తెలియటంతో అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement