
సుశాంత్ హీరోగా, మీనా చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ . ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, హరీష్ కోయిలగుండ్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘వాస్తవ సంఘటనల ఆధారంగా సాగే రొమాంటిక్ థ్రిల్లర్ ఇది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభమైంది. హీరో, హీరోయిన్‌పై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, తదితరులు నటిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు.
కాగా సుశాంత్ రీసెంట్‌గా ‘అలవైకుంఠపురములో’ సినిమాలో నటించారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘చిలసౌ’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ఈ సినిమాను జాతీయ అవార్డు వరించింది.
Comments
Please login to add a commentAdd a comment