ఆకట్టుకునే ‘అడ్డా’ | Adda is an upcoming Telugu film | Sakshi
Sakshi News home page

ఆకట్టుకునే ‘అడ్డా’

Published Tue, Aug 6 2013 1:42 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM

ఆకట్టుకునే ‘అడ్డా’

ఆకట్టుకునే ‘అడ్డా’

‘‘ఈ జనరేషన్ వాళ్లు ఎక్కువగా ఉపయోగించే పదం ‘అడ్డా’. సాఫ్ట్‌వేర్ వాళ్లే కాదు, పక్కా మాస్ కూడా ‘అడ్డా’ పదాన్ని ఉపయోగిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను తీర్చిదిద్దాం. క్లాస్‌నీ, మాస్‌నీ ఆకట్టుకునే కథ ఇది’’ అని నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు చెప్పారు. 
 
 ‘కాళిదాసు’, ‘కరెంట్’ చిత్రాలతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ హీరోగా కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న చిత్రం ‘అడ్డా’. 
 
 శాన్వి కథానాయిక. ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘పాటలు పెద్ద హిట్టయ్యాయి. అనూప్ రూబెన్స్ ఎక్స్‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. థియేటర్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నాం’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement