అందరినీ ఆకట్టుకునే అడ్డా | Adda Movie will impress each and every one | Sakshi
Sakshi News home page

అందరినీ ఆకట్టుకునే అడ్డా

Published Tue, Aug 13 2013 1:23 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM

అందరినీ  ఆకట్టుకునే అడ్డా

అందరినీ ఆకట్టుకునే అడ్డా

సుశాంత్ కథానాయకునిగా జి.ఎస్.కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘అడ్డా’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘అందరినీ ఆకట్టుకునే కథ, కథనాలతో ఈ చిత్రం రూపొందింది. 
 
 సుశాంత్‌కి, మా సంస్థకు మేలి మలుపుగా ఈ చిత్రం నిలుస్తుందని మా నమ్మకం. అనూప్‌రూబెన్స్ స్వరసారథ్యంలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. అతి త్వరలో ట్రిబుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపనున్నాం’’ అని తెలిపారు. 
 
 శాన్వి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రఘుబాబు, నాగినీడు, వేణుమాధవ్, స్వప్నిక తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహణం: ఎస్.అరుణ్‌కుమార్, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: కనల్‌కణ్ణన్, నిర్మాణం: శ్రీనాగ్ కార్పొరేషన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement