Adda
-
రూటు మార్చిన మెగాస్టార్ చిరంజీవి
-
నిఘా.. నిద్ర
ఓ వైపు రాయచూర్- హైదరాబాద్ జాతీయ రహదారి. మరోవైపు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలను కలిపే రైలుమార్గం. కృష్ణా, భీమా నదుల సంగమం. ఇంకేం అంతర్ రాష్ట్ర సరిహద్దులోని భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. పేలుడు పదార్థాలు, కల్లు రవాణా, మట్కా, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు అడ్డు లేకుండా పోయింది. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో మునిగి తేలుతోంది. రవాణా, వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు లేకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మాగనూరు మండలంలోని పలు గ్రామాలు కేంద్రంగా అక్రమ దందా జోరుగా సాగుతోంది. కృష్ణా రైల్వే స్టేషన్ అడ్డాగా కల్లు వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. కృష్ణా రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న కల్లు విక్రయ కేంద్రానికి కర్ణాటక నుంచి మద్యం ప్రియులు రైళ్ల ద్వారా చేరుకుంటున్నారు. ఇక్కడ కల్లు సేవించడంతో పాటు ట్యూబులు, క్యాన్ల ద్వారా అక్కడకు కల్లు తరలిస్తున్నారు. ఈ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతున్నా ఎక్సైజ్ విభాగం అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కల్తీ కల్లు తయారీలో వినియోగించే క్లోరల్ హైడ్రేట్ రైలుమార్గం ద్వారా మహారాష్ట్ర నుంచి స్థానిక వ్యాపారులకు సరఫరా అవుతోంది. కృష్ణా నదీ తీరం వెంట అనుమతి లేకుండా క్వారీలు నిర్వహిస్తున్నారనే పిర్యాదులున్నాయి. ఈ క్వారీల్లో వినియోగించే పేలుడు పదార్థారాలు కూడా మహా రాష్ట్ర నుంచి రైలుమార్గంలో తరలివస్తున్నాయి. టై రోడ్ పరిసర ప్రాంతాలు జూదం కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. పొరుగునే ఉన్న రాయచూరు థర్మల్ విద్యుత్ కేంద్రం పరిసర గ్రామాల నుంచి వచ్చే పేకాట రాయుళ్లకు స్థానికంగా కొందరు అడ్డా సమకూర్చుతున్నారు. ‘అందర్- బాహర్’ మొదటి పేజీ తరువాయి పేరిట లక్షల రూపాయల్లో జూదం కొనసాగుతుండగా స్థానిక ముఠాలకు రోజూ రూ.వేలల్లో ఆదాయం సమకూరుతోంది. కృష్ణా రైల్వే స్టేషన్ సమీపంలోనే ఓ రెండు దుకాణాలు కేంద్రంగా మట్కా కొనసాగుతోంది. బహిరంగంగానే బెట్టింగులు జరుగుతున్నా అరికట్టే దిశగా చర్యలు తీసుకున్న దాఖలా లేదు. కృష్ణానదికి అవతలి ఒడ్డున ఉన్న కర్ణాటక నుంచి మాగనూరు మండల పరిధిలోని గ్రామాలకు మద్యం సరఫరా అవుతోంది. పర్యవేక్షణ లేకపోవడంతో ఎంఆర్పీతో సంబంధం లేకుండా ఎక్కువ ధరలకు మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండి రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన రాయచూర్- హైదరాబాద్ మార్గంలో కీలక వి భాగాలకు చెందిన చెక్‌పోస్టులు కనిపిం చడం లేదు. వ్యవసాయ, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ చెక్‌పోస్టులు మాత్రమే ఉన్నా యి. కీలకమైన రవాణా, వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు ఇంకా ఏర్పాటు చేయలేదు. దీంతో సరైన అనుమతి పత్రాలు లేకుండానే కర్ణాటక- తెలంగాణ రాష్ట్రాల నడుమ వాణిజ్య సరుకుల రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సిమెంటు, ఇనుము, బొగ్గు, ఇసుక తదితరాలు ఎలాంటి అనుమతి లేకుండానే రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నాయి. ప్రొహిబిషన్, ఎక్సైజ్ విభాగానికి చెందిన చెక్‌పోస్టున్నా అది శిథిలావస్తకు చేరింది. షెడ్డులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది సతమతమవుతున్నారు. -
విదేశాల్లోనూ ‘అడ్డా’ - సుశాంత్
‘‘నా గత రెండు చిత్రాలకన్నా ‘అడ్డా’లో కొత్త లుక్‌లో కనిపిస్తాను. నటుడిగా నిరూపించుకోవడానికి ఆస్కారం ఉన్న పాత్ర నాది. అన్ని వర్గాలవారు చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు సుశాంత్. జి.సాయికార్తీక్ దర్శకత్వంలో శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అడ్డా’. సుశాంత్, శాన్వి జంటగా నటించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ - ‘‘రెండేళ్ల విరామం తర్వాత నా సినిమా విడుదలవుతోంది. ఈ రెండేళ్లల్లో ఎన్నో కథలు విన్నాను. కానీ ఈ చిత్రకథ బాగా నచ్చింది. విజయవంతమైన సినిమాకి కావల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ముందుగా ఈ చిత్రకథను చింతలపూడి శ్రీనివాసరావుగారికి కార్తీక్ చెప్పారు. చాలా బాగుందని చెప్పడంతో విని, నేనూ ఎగ్జయిట్ అయ్యాను. పూరీ జగన్నాథ్‌గారి శిష్యుడు కార్తీక్. అందుకని పూరీ తరహా పంచ్ డైలాగులు ఇందులో ఉంటాయి. ఈ సినిమా పరంగా ఆనందించదగ్గ విషయం ఏంటంటే.. విదేశాల్లో కూడా విడుదలవుతోంది. విదేశాల్లో విడుదలవుతున్న నా తొలి సినిమా ఇది. లవ్, యాక్షన్, సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలు సమపాళ్లల్లో కుదిరిన కథ. ఇలాంటి మంచి సినిమా చేయడానికి ఎన్నేళ్లయినా గ్యాప్ తీసుకోవచ్చు. ఎంత మంచి సినిమా తీసినా సరైన ప్రచారం లేకపోతే ప్రేక్షకులకు రీచ్ కాలేదు. అందుకే ప్రచార గీతాన్ని ఐపీఎల్ మ్యాచ్‌లో విడుదల చేశాం. టైటిల్, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా విజయం మీద నాకు చాలా నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
అందరినీ ఆకట్టుకునే అడ్డా
సుశాంత్ కథానాయకునిగా జి.ఎస్.కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘అడ్డా’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘అందరినీ ఆకట్టుకునే కథ, కథనాలతో ఈ చిత్రం రూపొందింది. సుశాంత్‌కి, మా సంస్థకు మేలి మలుపుగా ఈ చిత్రం నిలుస్తుందని మా నమ్మకం. అనూప్‌రూబెన్స్ స్వరసారథ్యంలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. అతి త్వరలో ట్రిబుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపనున్నాం’’ అని తెలిపారు. శాన్వి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రఘుబాబు, నాగినీడు, వేణుమాధవ్, స్వప్నిక తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహణం: ఎస్.అరుణ్‌కుమార్, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: కనల్‌కణ్ణన్, నిర్మాణం: శ్రీనాగ్ కార్పొరేషన్. -
ఆకట్టుకునే ‘అడ్డా’
‘‘ఈ జనరేషన్ వాళ్లు ఎక్కువగా ఉపయోగించే పదం ‘అడ్డా’. సాఫ్ట్వేర్ వాళ్లే కాదు, పక్కా మాస్ కూడా ‘అడ్డా’ పదాన్ని ఉపయోగిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను తీర్చిదిద్దాం. క్లాస్‌నీ, మాస్‌నీ ఆకట్టుకునే కథ ఇది’’ అని నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు చెప్పారు. ‘కాళిదాసు’, ‘కరెంట్’ చిత్రాలతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ హీరోగా కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న చిత్రం ‘అడ్డా’. శాన్వి కథానాయిక. ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘పాటలు పెద్ద హిట్టయ్యాయి. అనూప్ రూబెన్స్ ఎక్స్లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. థియేటర్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నాం’’ అని తెలిపారు.