రెండేళ్ల కష్టం ఫలించింది
రెండేళ్ల కష్టం ఫలించింది
Published Wed, Aug 21 2013 1:23 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
‘‘ ‘కరెంట్’ చిత్రం తర్వాత విరామం తీసుకుని చేసిన సినిమా ఇది. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రెండేళ్ల కష్టం ఫలించింది. నాయిక శాన్వితో నా కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందన్నారు’’ అని సుశాంత్ అన్నారు. సుశాంత్, శాన్వి జంటగా కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీ నాగ్ కార్పోరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మించిన ‘అడ్డా’ ఇటీవల విడుదలైంది.
మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ -‘‘500కు పైగా థియేటర్లలో విడుదల చేశాం. ఇంకా థియేటర్ల సంఖ్య పెంచుతున్నాం. క్లైమాక్స్‌లో సుశాంత్ బాగా చేశాడని అందరూ అంటున్నారు.
అనూప్ పాటలు, రీరికార్డింగ్ మెయిన్ హైలైట్’’ అని తెలిపారు. సుశాంత్ నటనకు మంచి స్పందన వస్తోందని నాగసుశీల పేర్కొన్నారు. డైలాగ్స్‌కు థియేటర్లో క్లాప్స్ పడుతున్నాయని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా అనూప్‌రూబెన్స్, శాన్వి, గౌతంరాజు కూడా మాట్లాడారు.
Advertisement
Advertisement