ఒకేసారి మూడు హిట్లు కొట్టినట్టుగా ఉంది
‘‘ఒకేసారి మూడు హిట్లు కొడితే ఎంత ఆనందంగా ఉంటుందో... అంత ఆనందాన్ని ‘అడ్డా’ విజయం ఇచ్చింది’’ అని నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు అన్నారు. సుశాంత్, శాన్వి జంటగా జి.సాయికార్తీక్ దర్శకత్వంలో నాగసుశీలతో కలిసి తాను నిర్మించిన ‘అడ్డా’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆనందం వ్యక్తం చేస్తూ శ్రీనివాసరావు పై విధంగా స్పందించారు. ఇంకా చెబుతూ -‘‘మంచి టీమ్ దొరకడం వల్లే ఇంత విజయాన్ని సాధించగలిగాం.
సుశాంత్ నటన ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. నిర్మాణంలో ఉన్నప్పుడే ఓ హిట్ సినిమా తీస్తున్నాం అనిపిం చింది. కానీ మా అంచనాలకు మించి సినిమా సూపర్‌హిట్ అయ్యింది’’ అని సంతోషం వెలిబుచ్చారు శ్రీనివాసరావు. 500 థియేటర్లలో సినిమాను విడుదల చేశామని, ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకొని మరికొన్ని థియేటర్లు పెంచామని, తొలివారం వసూళ్లకే బయ్యర్లు సేఫ్ జోన్‌లోకొచ్చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ‘‘కాళిదాసు, కరెంట్, అడ్డా చిత్రాలతో మా ‘శ్రీనాగ్ కార్పొరేషన్’కి ఓ గౌరవం దక్కింది. ఇక నుంచి అన్ని వర్గాల వారినీ అలరించే సినిమాలే తీస్తాం.
ప్రభుదేవా కజిన్, కొరియోగ్రాఫర్ విష్ణుదేవా ఓ కథ చెప్పాడు. చాలా బావుంది. ఆయన దర్శకత్వం లో ఓ సినిమా ఉంటుంది. తెలుగు, తమిళభాషల్లో ఏకకాలంలో ఆ సినిమాను నిర్మిస్తాం. ఆ సినిమా వివరాలు త్వరలో ప్రకటిస్తాం. అలాగే మారుతి దర్శకత్వంలో సినిమా ఉం టుంది. బి.జయ దర్శకత్వంలో కూడా సినిమా చేయ డానికి మేం సిద్ధం’’ అని శ్రీనివాసరావు తెలిపారు. ఇక నుంచి మిగతా హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తామని, అగ్ర దర్శకులతో కూడా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నామని ఆయన చెప్పారు.