Chintalapudi Srinivasa Rao
-
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నాగసుశీల ఫిర్యాదు
-
చింతలపూడిపై నాగసుశీల ఫిర్యాదు
అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల తన వ్యాపార భాగస్వామి చింతలపూడి శ్రీనివాస్ పై నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో పంజాగుట్ట పోలీసులు విచారణ ప్రారంభించారు. గత 11 ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా ఉన్న నాగసుశీల, శ్రీనివాస్ ల మధ్య ఏడాది కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. తన అనుమతి లేకుండా కంపెనీ ఆస్తులను అమ్ముకున్నారని నాగసుశీల ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. శ్రీనివాస్ భార్యతో పాటు మరో 12 మందిపై నాగసుశీల ఫిర్యాదు చేశారు. ఇప్పటికే వీరి వివాదం ఏడాది కాలంగా హైకోర్టులో పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే శ్రీనివాస్ కంపెనీ ఆస్తులను ఇతరులకు రిజిస్టర్ చేయటంతో నాగసుశీల మరోసారి కోర్టును ఆశ్రయించారు. నాగసుశీల, శ్రీనివాస్ లు 12 ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఆరు సినిమాలను నిర్మించారు. ఇటీవల తెరకెక్కిన ఆటాడుకుందాం రా సినిమా విషయంలో వివాదం మొదలైనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించిన చింతలపూడి శ్రీనివాస్, నాగ సుశీల కావాలనే తనపై తప్పుడు కంప్లయింట్ ఇచ్చారని ఆరోపించారు. నాగసుశీల తనకు బాకీ పడ్డారని అవి ఇవ్వకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని, కంపెనీ ఆస్తులను సొంతం చేసుకునేందుకే ఇలాంటి కంప్లయింట్ లు ఇస్తున్నారని తెలిపారు. ఇప్పటికే సివిల్ కేసు నడుస్తుండగా ఎలాగైనా ఆ కేసును క్రిమినల్ కేసుగా మార్చాలని ప్రయత్నిస్తున్నారన్నారు. -
సుశాంత్ సినిమా షురూ
‘కాళిదాసు’, ‘కరెంట్’, ‘అడ్డా’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీజీ ఫిలిమ్స్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ఉగాది రోజున ప్రారంభమైంది. నాగార్జున పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ను దర్శకునికి అందించారు. హీరో సుశాంత్ ‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు ’ అని డైలాగ్ చెప్పే సన్నివేశానికి అఖిల్ అక్కినేని కెమెరా స్విచాన్ చేయగా, నాగచైతన్య క్లాప్‌నిచ్చారు. సుమంత్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శ్రీధర్ సీపాన మంచి కథ ఇచ్చారు. ఈ చిత్రంతో సుశాంత్‌కు భారీ హిట్ రావడం ఖాయం. ఏప్రిల్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, ఫైట్స్: కనల్ కణ్ణన్, ప్రొడక్షన్ కంట్రోలర్: ఎం.వి.ఎస్. వాసు -
ఒకేసారి మూడు హిట్లు కొట్టినట్టుగా ఉంది
‘‘ఒకేసారి మూడు హిట్లు కొడితే ఎంత ఆనందంగా ఉంటుందో... అంత ఆనందాన్ని ‘అడ్డా’ విజయం ఇచ్చింది’’ అని నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు అన్నారు. సుశాంత్, శాన్వి జంటగా జి.సాయికార్తీక్ దర్శకత్వంలో నాగసుశీలతో కలిసి తాను నిర్మించిన ‘అడ్డా’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆనందం వ్యక్తం చేస్తూ శ్రీనివాసరావు పై విధంగా స్పందించారు. ఇంకా చెబుతూ -‘‘మంచి టీమ్ దొరకడం వల్లే ఇంత విజయాన్ని సాధించగలిగాం. సుశాంత్ నటన ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. నిర్మాణంలో ఉన్నప్పుడే ఓ హిట్ సినిమా తీస్తున్నాం అనిపిం చింది. కానీ మా అంచనాలకు మించి సినిమా సూపర్‌హిట్ అయ్యింది’’ అని సంతోషం వెలిబుచ్చారు శ్రీనివాసరావు. 500 థియేటర్లలో సినిమాను విడుదల చేశామని, ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకొని మరికొన్ని థియేటర్లు పెంచామని, తొలివారం వసూళ్లకే బయ్యర్లు సేఫ్ జోన్లోకొచ్చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ‘‘కాళిదాసు, కరెంట్, అడ్డా చిత్రాలతో మా ‘శ్రీనాగ్ కార్పొరేషన్’కి ఓ గౌరవం దక్కింది. ఇక నుంచి అన్ని వర్గాల వారినీ అలరించే సినిమాలే తీస్తాం. ప్రభుదేవా కజిన్, కొరియోగ్రాఫర్ విష్ణుదేవా ఓ కథ చెప్పాడు. చాలా బావుంది. ఆయన దర్శకత్వం లో ఓ సినిమా ఉంటుంది. తెలుగు, తమిళభాషల్లో ఏకకాలంలో ఆ సినిమాను నిర్మిస్తాం. ఆ సినిమా వివరాలు త్వరలో ప్రకటిస్తాం. అలాగే మారుతి దర్శకత్వంలో సినిమా ఉం టుంది. బి.జయ దర్శకత్వంలో కూడా సినిమా చేయ డానికి మేం సిద్ధం’’ అని శ్రీనివాసరావు తెలిపారు. ఇక నుంచి మిగతా హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తామని, అగ్ర దర్శకులతో కూడా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నామని ఆయన చెప్పారు.