
హీరో సుశాంత్, పక్కన ప్రచారంలో ఉన్న ఫేక్ పోస్టర్
హైదరాబాద్: అక్కినేని కుటుంబం నుంచి టాలీవుడ్‌కు పరిచయమైన హీరో సుశాంత్ మంచి హిట్ కోసం చానాళ్లుగా ఎదురుచూస్తున్నారు. అనూహ్య రీతిలో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రతో సుశాంత్ ‘చిలసౌ’అనే సినిమా చేశారు. ఇప్పటికే విడుదలైన ‘చిలసౌ’ టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వీలైనంత తొందరగా సినిమాను విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది.
కాగా, సుశాంత్ మరో కొత్త సినిమా ప్రారంభించారని, దాని టైటిల్ ‘గట్టిగా కొడతా..’ అని ఓ పోస్టర్, దాంతోపాటు వెకిలి కామెంట్లు సోషల్ మీడియాలో హల్‌చల్‌గా మారాయి. సదరు పోస్టర్లపై నటుడు సుశాంత్ గురువారం స్పందించారు. ‘‘ట్రోలింగ్ చేయడం వేరు. కానీ ఫేక్ న్యూస్ క్రియేట్‌చేసి మరీ ట్రోల్ చేయడమేంటో! ఏదేమైనా నాపై ధ్యాస ఉంచిన అందరికీ ధన్యవాధాలు’’ అని హీరో తన ట్విటర్‌లో రాసుకొచ్చారు.
It’s one thing to troll...
— Sushanth A (@iamSushanthA) 7 June 2018
But to create fake news and then try to troll 👏 (slow clap)
Thanks for all the attention 😎
Comments
Please login to add a commentAdd a comment