హను-మాన్‌కు హిట్‌ టాక్‌.. ఆదిపురుష్‌ డైరెక్టర్‌ను ఆడేసుకుంటున్నారు! | HanuMan Movie: Adipurush Director Om Raut Being Trolled By Netizens - Sakshi
Sakshi News home page

HanuMan Movie: హను-మాన్‌ రిలీజ్‌.. ఆదిపురుష్‌ డైరెక్టర్‌పై మళ్లీ ట్రోలింగ్‌!

Published Fri, Jan 12 2024 12:08 PM | Last Updated on Fri, Jan 12 2024 12:27 PM

HanuMan Movie: Netizens Satires on Adipurush Director Om Raut - Sakshi

ఓం రౌత్‌ను మళ్లీ ఆడేసుకుంటున్నారు. హనుమాన్‌ సినిమా ఆడే థియేటర్లలో ఓం రౌత్‌ కోసం ఓ సీటు వదిలేయండి, చిన్న సినిమా అయినా ఎలా తీశారో చూసి నేర్చుకో అం

సినిమా బాగుంటే నెత్తిన పెట్టేసుకుంటారు జనాలు. అదే సినిమా షెడ్డుకెళ్లిపోయిందంటే మాత్రం చిత్రయూనిట్‌ను చెడుగుడు ఆడేసుకుంటారు. గతేడాది బాక్సాఫీస్‌ వద్ద రిలీజైన భారీ బడ్జెట్‌ చిత్రాల్లో ఆదిపురుష్‌ ఒకటి. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజైనప్పటినుంచే ట్రోలింగ్‌ బారిన పడింది. పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌తో ఈ ప్రయోగాలేంటని అభిమానులు మండపడ్డారు. ఆ గ్రాఫిక్స్‌, గెటప్స్‌ మార్చమని మొత్తుకున్నారు.

ఓం రౌత్‌పై ట్రోలింగ్‌
అబ్బే, దర్శకుడికి ఏది నచ్చితే అదే ఫైనల్‌! ఓం రౌత్‌ ఎవరి సలహాలను, సూచనలను పట్టించున్న పాపాన పోలేదు. చివరకు ఏమైంది? సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. ఆ సమయంలో ఓం రౌత్‌పై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. తాజాగా మరోసారి ఓం రౌత్‌పై సెటైర్లు వేస్తున్నారు సినీ లవర్స్‌. కారణం హను-మాన్‌ మూవీ. ఈ సినిమాకు ఓం రౌత్‌కు సంబంధం ఏంటనుకుంటున్నారా? మరేం లేదు. ఆదిపురుష్‌ అంత డిజాస్టర్‌ అవడానికి పేలవమైన వీఎఫ్‌ఎక్స్‌ కూడా ఓ ప్రధాన కారణం.

వీఎఫ్‌ఎక్స్‌ వల్లే సినిమా..
అయితే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్‌ విజయానికి అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్‌ ప్రధాన బలంగా మారింది. ఇంకేముంది.. జనాలు హనుమాన్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మను ఆకాశానికెత్తుతున్నారు. ఆదిపురుష్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ను మళ్లీ ఆడేసుకుంటున్నారు. 'హనుమాన్‌ సినిమా ఆడే థియేటర్లలో ఓం రౌత్‌ కోసం ఓ సీటు వదిలేయండి', 'చిన్న సినిమా అయినా ఎలా తీశారో చూసి నేర్చుకో..' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓం రౌత్‌.. ఆదిపురుష్‌ సినిమాను రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ప్రశాంత్‌ వర్మ.. హను-మాన్‌ చిత్రాన్ని కేవలం రూ.25 కోట్లలోనే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎక్స్‌(ట్విటర్‌)లో నెటిజన్ల రియాక్షన్‌ ఎలా ఉందో కింది ట్వీట్స్‌లో మీరే చూసేయండి..

చదవండి: హను-మాన్‌ రివ్యూ, సూపర్‌ హీరో మూవీ ఎలా ఉందంటే?
భారీ ధరకు 'హనుమాన్‌' ఓటీటీ రైట్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

whatsapp channel

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement