![Prashanth Varma Interesting Comments On SS Rajamouli - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/28/hanuman.jpeg.webp?itok=QjfHmIQm)
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన సినిమాను తీశారంటూ ప్రశాంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. జక్కన్న టీమ్‌లోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు.
ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..'ఆయన మేకింగ్ విధానం చాలా ఇష్టం. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసేందుకు ఎంతో ప్రయత్నించా. ఇంజినీరింగ్‌లో ఉండగానే ఆయనకు చాలాసార్లు మెయిల్స్ పంపించా. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. టాలెంట్ ఉన్నా నన్నెందుకు తీసుకోవడం లేదనే కారణంతో ఆయనపై కోపం వచ్చింది. అదే సమయంలో నాకు ఏకలవ్యుడు గుర్తుకువచ్చారు. రాజమౌళి సినిమాలు, మేకింగ్ వీడియోలు చూసి చాలా నేర్చుకున్నా' అని అన్నారు.
అంతే కాకుండా పెద్ద హీరోలతో సినిమాలు చేసేందుకు తాను వ్యతిరేకం కాదని తెలిపారు. వారితో సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని వెల్లడించారు. అలాంటి వారికోసం ఎదురుచూసి నా సమయాన్ని వృథా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత డెడ్‌లైన్ పెట్టుకుని మరీ వర్క్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక వేళ టామ్ క్రూయిజ్ వచ్చినా.. నా వద్ద ఉన్న వాళ్లతోనే సినిమా చేస్తానని ప్రశాంత్ వర్మ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment