'హనుమాన్' సినిమా రచ్చ బాక్సాఫీస్ దగ్గర ఇంకా కొనసాగుతూనే ఉంది. సంక్రాంతికి పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైన ఈ చిత్రం.. సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికే రూ.250 కోట్ల మేర కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా.. మూడోవారంలోనూ థియేటర్లలో ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. అదలా ఉండగా ఇప్పుడు 'హనుమాన్' ఓటీటీ రిలీజ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)
చైల్డ్ ఆర్టిస్టుగా చాలా ఫేమ్ తెచ్చుకున్న హీరోగా మారిన తేజ సజ్జా.. 'హనుమాన్' మూవీలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా ప్రేక్షకుల్ని టార్గెట్ చేసుకున్న ఈ చిత్రం.. అన్నిచోట్ల హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రారంభంలో థియేటర్ల సమస్య వచ్చింది గానీ ఇప్పుడు మాత్రం దాదాపు అన్ని చోట్ల సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ విషయంలో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది.
'హనుమాన్' చిత్ర డిజిటల్ హక్కుల్ని జీ5 సంస్థ దక్కించుకుంది. ప్లాన్ ప్రకారం 5-6 వారాల్లోపే ఓటీటీ రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా హిట్ తెచ్చుకోవడంతో పాటు వసూళ్లు ఇంకా వస్తుండటంతో ఓటీటీ స్ట్రీమింగ్‌ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మార్చి తొలి రెండు వారాల్లో రావొచ్చని అంటున్నారు. దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు పెళ్లయిపోయిందా? భార్య ఎవరంటే?)
Comments
Please login to add a commentAdd a comment