
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల వివాహం చేసుకుని ఓ ఇంటివాడైన 'జబర్దస్త్' కమెడియన్ 'అల్లరి' హరీశ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ రిసెప్షన్‌కు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తీన్‌మార్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సహా పలు టాలీవుడ్ చిత్రాల్లో తనదైన శైలి హాస్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కమెడియన్ హరీశ్ కోయగండ్ల. ఈ అక్టోబర్ 5న హరీశ్ ఓ ఇంటివాడయ్యారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసి ఇటీవల తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు.
కమెడియన్ హరీశ్ వివాహ రిసెప్షన్‌కు దర్శకులు వీఎన్ ఆదిత్య, జయంత్ సి పరాన్జీ, అవసరాల శ్రీనివాస్, టాలీవుడ్ నటులు సాయి ధరమ్ తేజ్, సుశాంత్, అశ్విన్, కాదంబరి కిరణ్, ఉత్తేజ్, నటి మోనాల్ గజ్జర్, కమెడియన్లు వెన్నెల కిషోర్, 'తాగుబోతు' రమేశ్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. పలు షార్ట్ ఫిలింస్ తో అలరించిన హాస్యనటుడు హరీశ్ గతంలో జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. హరీశ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment