రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
Published Mon, Sep 19 2016 10:44 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
ఏలూరు: రోడ్డు ప్రమాదంలో ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటన్న తేజ సుశాంత్(19) ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఈ రోజు స్నేహితుడితో కలిసి బైక్‌పై కళాశాలకు వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. దీంతో సుశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
Advertisement
Advertisement