విష్ణుదేవా దర్శకత్వంలో సుశాంత్
విష్ణుదేవా దర్శకత్వంలో సుశాంత్
Published Sun, Nov 24 2013 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
కాళిదాసు, కరెంట్, అడ్డా చిత్రాలతో మంచి ఈజ్ ఉన్న నటునిగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ కథానాయకునిగా ఓ చిత్రం రూపొందనుంది. శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల కలిసి నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా ప్రభుదేవా శిష్యుడు విష్ణుదేవా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ -‘‘ప్రభుదేవా పర్యవేక్షణలో తయారైన కథ ఇది.
సుశాంత్‌కి ఈ కథ చాలా బాగుంటుందని అందరికీ అనిపించిన తర్వాతే ఈ కథను ఓకే చేశాం. ప్రఖ్యాత నృత్య దర్శకుడు గణేశ్ ఆచార్య వద్ద శిష్యరికం చేసి, వాంటెడ్, రామ్‌లీలా, రాంబో రాజ్‌కుమార్ లాంటి భారీ చిత్రాలకు సోలో కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు విష్ణుదేవా. తప్పకుండా దర్శకునిగా కూడా తను విజయం సాధిస్తాడని మా నమ్మకం. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి స్వరాలందించే పనిలో ఉన్నారు. సాంకేతికంగా ఉన్నతంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం’’ అని తెలిపారు.
‘‘స్విట్జర్లాండ్‌లో ‘అడ్డా’ పాటల చిత్రీకరణ టైమ్‌లో విష్ణుదేవా ఈ లైన్ చెప్పాడు. ‘అడ్డా’ విడుదలయ్యాక.. లైన్‌ను డెవలప్ చేసి మరింత డీటైల్డ్‌గా కథ చెప్పాడు. నేను ఎలాంటి సినిమా చేయాలని ఎదురుచూస్తున్నానో... సరిగ్గా అలాంటి కథనే విష్ణు చెప్పాడనిపించింది. ఆడియన్స్‌కూ, అక్కినేని ఫ్యాన్సుకూ నచ్చే సినిమా అవుతుంది’’ అని సుశాంత్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి పోరాటాలు: కనల్ కణ్ణన్, సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్.
Advertisement
Advertisement