Vishnu Deva
-
ఈ తిథులో మహా విష్ణు పూజ చేస్తే అనుగ్రహం వస్తుంది
-
విశాఖ ఉక్కు కోసం యాక్షన్ ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖ ఉక్కు కర్మాగారం(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)ను మళ్ళీ లాభాల బాట పట్టించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విష్ణు దేవ సాయి బుధవారం రాజ్య సభలో వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సెయిల్, ఆర్ఐఎన్ఎల్ను పటిష్టం చేసి వాటిని లాభాల్లోకి తెచ్చే ప్రణాళిక రూపకల్పన కోసం 2017లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ఆర్ఐఎన్ఎల్కు సొంతంగా గనులు కేటాయించాలన్న డిమాండ్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాస్తవాన్ని మంత్రి అంగీకరించారు. మైనింగ్ లీజుల కేటాయింపు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించినందున, కేంద్రం ఆ విషయంలో జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఉక్కు గనులను ఆపరేట్ చేస్తున్న ఒడిశా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఓఎండీసీ) ఆధ్వర్యంలోని గనులు మూతపడినందున ఆర్ఐఎన్ఎల్కు ఖనిజ సరఫరా జరగలేదని మంత్రి వివరించారు. లాభదాయకత ప్రాతిపదికన పెన్షన్ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కూడా ఉక్కు శాఖ మంత్రి వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే సిబ్బందికి పదవీ విరమణ ప్రయోజన పథకంలో భాగంగా తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పెన్షన్ స్కీమ్‌లను ప్రవేశపెట్టే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రతిపాదనల పరిశీలనకై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. కమిటీ సూచనల ప్రకారం కంపెనీ లాభదాయకత ప్రాతిపదికన, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే సిబ్బందికి పెన్షన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం యోచిస్తోందని మంత్రి వెల్లడించారు. -
విష్ణుదేవా దర్శకత్వంలో సుశాంత్
కాళిదాసు, కరెంట్, అడ్డా చిత్రాలతో మంచి ఈజ్ ఉన్న నటునిగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ కథానాయకునిగా ఓ చిత్రం రూపొందనుంది. శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల కలిసి నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా ప్రభుదేవా శిష్యుడు విష్ణుదేవా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. డిసెంబర్లో ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ -‘‘ప్రభుదేవా పర్యవేక్షణలో తయారైన కథ ఇది. సుశాంత్‌కి ఈ కథ చాలా బాగుంటుందని అందరికీ అనిపించిన తర్వాతే ఈ కథను ఓకే చేశాం. ప్రఖ్యాత నృత్య దర్శకుడు గణేశ్ ఆచార్య వద్ద శిష్యరికం చేసి, వాంటెడ్, రామ్‌లీలా, రాంబో రాజ్‌కుమార్ లాంటి భారీ చిత్రాలకు సోలో కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు విష్ణుదేవా. తప్పకుండా దర్శకునిగా కూడా తను విజయం సాధిస్తాడని మా నమ్మకం. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి స్వరాలందించే పనిలో ఉన్నారు. సాంకేతికంగా ఉన్నతంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం’’ అని తెలిపారు. ‘‘స్విట్జర్లాండ్‌లో ‘అడ్డా’ పాటల చిత్రీకరణ టైమ్‌లో విష్ణుదేవా ఈ లైన్ చెప్పాడు. ‘అడ్డా’ విడుదలయ్యాక.. లైన్‌ను డెవలప్ చేసి మరింత డీటైల్డ్‌గా కథ చెప్పాడు. నేను ఎలాంటి సినిమా చేయాలని ఎదురుచూస్తున్నానో... సరిగ్గా అలాంటి కథనే విష్ణు చెప్పాడనిపించింది. ఆడియన్స్‌కూ, అక్కినేని ఫ్యాన్సుకూ నచ్చే సినిమా అవుతుంది’’ అని సుశాంత్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి పోరాటాలు: కనల్ కణ్ణన్, సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్.