కామెడీకి... 60 లక్షల సెట్! | 60 lakhs set only for comedy track | Sakshi
Sakshi News home page

కామెడీకి... 60 లక్షల సెట్!

Published Tue, Dec 15 2015 11:27 PM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

కామెడీకి...  60 లక్షల సెట్!

కామెడీకి... 60 లక్షల సెట్!

‘‘ఓ యువకుడు తన లక్ష్యం కోసం కొంతమందితో సీరియస్‌గా ఆటాడేస్తాడు. ఇంతకూ అతని లక్ష్యం ఏంటి? అతనాడిన గేమ్ ఏంటి? అనేది తెలియాలంటే ‘ఆటాడుకుందాం రా’ చూడాల్సిందే’’ అంటున్నారు హీరో సుశాంత్. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీ జి ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణంలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగసుశీల నిర్మిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం.. రా’. సుశాంత్, సోనమ్‌ప్రీత్ బజ్వా జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పాటలు మినహా పూర్తయ్యింది.
 
 సుశాంత్ మాట్లాడుతూ - ‘‘మంచి కథ కోసం ఇన్నాళ్లు ఎదురుచూశా. ఈ కథ నచ్చింది’’ అని చెప్పారు. ‘‘ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కామెడీ సీన్ కోసం స్పెషల్‌గా 60 లక్షల ఖర్చుతో టైమ్ మెషీన్ సెట్ వేశాం. కామెడీ సీన్ కోసం ఇంత ఖర్చు పెట్టి, సెట్ వేయడం ఇదే ఫస్ట్ టైమ్’’ అని జి. నాగేశ్వరరెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement