
‘చి.ల.సౌ’ చిత్రంతో డీసెంట్ హిట్ కొట్టాడు అక్కినేని హీరో సుశాంత్. ఈ మూవీ సక్సెస్ కావడంతో సుశాంత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో సోలో హీరోగానే కాకుండా, ప్రాధాన్యం ఉన్న అతిథి ప్రాతలను కూడా పోషించేందుకు రెడీ అయ్యాడు. సుశాంత్ ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.
ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సుశాంత్.. తాజాగా మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. మళ్లీ చిత్రబృందంతో కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణతో కలిసి ఉన్న పిక్‌ను పోస్ట్ చేశాడు. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ చిత్రాల తరువాత హ్యాట్రిక్ హిట్‌కు ఈ ద్వయం రెడీ అవుతున్నారు.
One of the many awesome reunions on set today! @eyrahul #AA19 pic.twitter.com/6M9zxixGEI
— Sushanth A (@iamSushanthA) June 24, 2019
Comments
Please login to add a commentAdd a comment