Ee Nagaraniki Emaindi Actor Sai Sushanth Engagement Pic Goes Viral, Post Inside - Sakshi
Sakshi News home page

Sai Sushanth Engagement: నిశ్చితార్థం చేసుకున్న సుశాంత్.. సోషల్ మీడియాలో వైరల్!

Published Wed, Jul 5 2023 1:16 PM | Last Updated on Wed, Jul 5 2023 2:23 PM

Ee Nagaraniki Emaindi Actor Sai Sushanth Engagement Pic Viral - Sakshi

ఈ నగరానికి ఏమైంది? సినిమా చూడనివారు ఉండరు. ఈ చిత్రంలో సాయి సుశాంత్ రెడ్డి తన నటనతో అందరినీ మెప్పించాడు. ఈ చిత్రంలో అతని పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అ‍య్యారు. చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ చిత్రం రిలీజై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రి రీలీజ్ కూడా చేశారు. 

(ఇది చదవండి: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక )

అయితే తాజాగా ఈ నగరానికి ఏమైంది?  చిత్ర నటుడు సాయి సుశాంత్ రెడ్డి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. తనకు కాబోయే అ‍మ్మాయికి ఎంగేజ్‌మెంట్‌ ఉంగరం పెడుతున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్‌ కాబోయే జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా తెగ వైరలవుతోంది. అయితే ఆ అమ్మాయి ఎవరు అనే వివరాలు తెలియరాలేదు.  కాగా.. సుశాంత్ రెడ్డి గతేడాది నాగచైతన్య నటించిన థ్యాంక్యూ చిత్రంలో నటించారు. 

(ఇది చదవండి: బలగం మూవీ అరుదైన ఘనత.. ఇంతవరకు ఏ సినిమాకు దక్కలేదు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement