
రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఇదే చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది రహస్య గోరఖ్. జంటగా ఆన్‌స్క్రీన్‌లో రొమాన్స్ చేసిన వీళ్లిద్దరూ ఆఫ్‌స్క్రీన్‌లోనూ ప్రేమించుకుంటున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. మొదట్లో స్నేహితులుగా ఉన్నప్పటికీ రానురానూ అది ప్రేమగా ముదిరిందని టాక్ నడిచింది. ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోస్తూ ఇద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లేవారు.
తాజాగా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న మన యంగ్ హీరోకు ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు.
#TFNReels: Visuals from the engagement ceremony of @Kiran_Abbavaram & @rahasya_gorak!💍💕#KiranAbbavaram #RahasyaGorak #TeluguFilmNagar pic.twitter.com/HdVJmyV9mC
— Telugu FilmNagar (@telugufilmnagar) March 13, 2024