అఖిల్ ఆట.. | Akhil Special Song Making in Aatadukundam Raa Movie | Sakshi
Sakshi News home page

అఖిల్ ఆట..

Published Wed, Aug 10 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

అఖిల్ ఆట..

అఖిల్ ఆట..

 ‘మనం’లో తళుక్కున మెరిశాడు అఖిల్. మళ్లీ అత్తకొడుకు సుశాంత్ కోసం అతిథిగా సందడి చేయడానికి రెడీ అయ్యాడు. సుశాంత్, సోనమ్‌ప్రీత్ బజ్వా జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎ.నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం.. రా’. ఇందులో అక్కినేని అన్నదమ్ములు నాగచైతన్య, అఖిల్ అతిథులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
 అన్నపూర్ణ ఏడెకరాలలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో హీరో హీరోయిన్లతో పాటు అఖిల్ పాల్గొనగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు నృత్యరీతులు సమకూరుస్తున్నారు. రెండు రోజుల పాటు షూటింగ్ జరుగుతుందట. అక్కినేని ఫ్యామిలీలో అఖిల్, సుశాంత్ మంచి డ్యాన్సర్స్. ఇద్దరూ కలసి ఏ రేంజ్‌లో స్టెప్పులు ఇరగదీశారో ఈ నెల 19న విడుదలవు తున్న సినిమా చూస్తే తెలుస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement