‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’లో..!
‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’లో..!
Published Sun, Jan 26 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
ఇంకొన్నాళ్ల పాటు నా ప్రయాణం తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లోనే అంటున్నారు కృతి కర్భందా. వచ్చే నెల 3న సుమన్ శైలేంద్రతో కలిసి ఆమె ఈ రైలు ప్రయాణం చేయబోతున్నారు. వీళ్లతో పాటు అశోక్, బుల్లెట్ ప్రకాష్, వీణా సుందర్, సాధు కోకిల తదితర తారలు కూడా తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో వెళతారు. విషయం ఏంటంటే.. సందీప్‌కిషన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా రూపొందిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రం కన్నడంలో ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’ పేరుతో రీమేక్ కానుంది.
సుమన్ శైలేంద్ర, కృతి జంటగా పొన్‌కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇటీవలే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చూశాననీ, చాలా నచ్చిందని కృతి తెలిపారు. ఇదిలా ఉంటే ఈ రీమేక్‌తో పాటు తెలుగు ‘కిక్’ రీమేక్ ‘సూపరో రంగా’లో కూడా ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ఇలా ఒకేసారి రెండు రీమేక్స్‌లో నటించడం థ్రిల్లింగ్‌గా ఉందని, ‘కిక్’లో ఇలియానా, ‘వెంకటాద్రి...’లో రకుల్ నటనను అనుకరించకుండా నా శైలిలో యాక్ట్ చేస్తానని కృతి తెలిపారు.
Advertisement
Advertisement