పెళ్లి కొడుకు కానున్న వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ దర్శకుడు | director merlapaka gandhi get ready to wedlock | Sakshi
Sakshi News home page

పెళ్లి కొడుకు కానున్న వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ దర్శకుడు

Published Fri, Aug 8 2014 6:39 PM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

director merlapaka gandhi get ready to wedlock

హైదరాబాద్: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన మేర్లపాక గాంధీ ఓ ఇంటివాడు కానున్నాడు. తన మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్తూరు జిల్లాలోని రేణిగుంట గ్రామానికి చెందిన గాంధీ ఆగస్టు 11 తేది సోమవారం పెళ్లి కొడుకు కానున్నాడు. గత ఏడాది సినీ ప్రస్తానానికి నాంది పలికిన గాంధీ తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు.  ప్రముఖ నవలా రచయిత మేర్లపాక మురళి ,విజయల కుమారుడైన గాంధీకి రేణిగుంట మండలం జీవగ్రామ్ ప్రాంతానికి చెందిన సుష్మతో ఏడు అడుగులు వేయనున్నాడు.  మరో మూడు రోజుల్లో అంటే.. సోమవారం తెల్లవారుజామున తిరుపతి, తిరుచానురు రోడ్డులో ఉన్న అర్బన్ హబ్స్(శిల్పారామం)లో వీరి వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
 

గత ఏడాది నవంబర్‌లో విడుదలైన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విభిన్న ప్రయత్నంగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, వాణిజ్య పరంగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.  ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమై టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించారు. మేర్లపాక గాంధీ తన రెండో చిత్రాన్ని సుశాంత్ హీరోగా చేయబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం అయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement