రైలు ప్రయాణంలో ప్రణయం | Sundeep Kishan love story in 'Venkatadri Express' | Sakshi
Sakshi News home page

రైలు ప్రయాణంలో ప్రణయం

Published Wed, Oct 23 2013 1:39 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

రైలు ప్రయాణంలో ప్రణయం

రైలు ప్రయాణంలో ప్రణయం

‘‘హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఓ అమ్మాయి, అబ్బాయి ప్రయాణం చేస్తుంటారు. ఈ ప్రయాణంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన ప్రణయానుభవాలతో ఈ సినిమా రూపొందింది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పారు. సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జెమినీ కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ -‘‘నాలుగేళ్లుగా తన సినిమాకు ఫొటోగ్రఫీ చేయమని సందీప్ అడుగుతున్నాడు. మంచి కథ దొరికితే చేస్తానన్నాను. ఈ కథ వినగానే వెంటనే ఇంప్రెస్ అయ్యాను’’ అని తెలిపారు. తన కెరీర్‌లో చాలా స్పెషల్ సినిమా ఇదని సందీప్‌కిషన్ పేర్కొన్నారు. ఈ నెల 25న పాటల్ని విడుదల చేస్తున్నామని సంగీత దర్శకుడు రమణ గోగుల చెప్పారు. ఇందులో పిసినారి అమ్మాయిగా నటిస్తున్నానని రకుల్ ప్రీత్ తెలిపారు. చిత్రీకరణ పూర్తయిందని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి పాటలు: భాస్కర్ భట్ల, శ్రీమణి, కాసర్ల శ్యామ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement