వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వలపు ప్రయాణం | Venkatadri Express Coming On 29th November | Sakshi
Sakshi News home page

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వలపు ప్రయాణం

Published Mon, Nov 18 2013 12:21 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వలపు ప్రయాణం - Sakshi

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వలపు ప్రయాణం

 హైదరాబాద్, తిరుపతి మధ్య నడిచే అనేక ఎక్స్‌ప్రెస్‌లలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఒకటి. ఈ రైలులో వెళుతోన్న ఓ అమ్మాయి, ఓ అబ్బాయి జీవితాన్ని ఈ ప్రయాణం ఏ విధంగా మలుపు తిప్పింది? వలపులూ ఆ మలుపులూ తెలియాలంటే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వచ్చేవరకూ ఆగాల్సిందే. సందీప్ కిషన్, రకుల్‌ప్రీత్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కిరణ్ నిర్మించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. రమణ గోగుల సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం’’ అని చెప్పారు. ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement