వందో తప్పు చేయకుండా..? | Venkatadri Express, a family entertainer | Sakshi
Sakshi News home page

వందో తప్పు చేయకుండా..?

Published Fri, Nov 29 2013 1:22 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

వందో తప్పు చేయకుండా..? - Sakshi

వందో తప్పు చేయకుండా..?

‘‘శిశుపాలుడు వంద తప్పులు చేస్తే శ్రీకృష్ణుడు శిక్షిస్తాడు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని తయారు చేసిన కథ ఇది’’ అన్నారు మేర్లపాక గాంధీ. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సందీప్‌కిషన్ హీరోగా కిరణ్ నిర్మించిన చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘వంద తప్పులు చేస్తే కొడుకుని ఇంట్లోంచి పంపించడానికి రెడీగా ఉంటాడు ఓ తండ్రి. 99 తప్పులు చేసిన ఆ కొడుకు ఒక్క తప్పు చెయ్యకుండా ఉండటానికి ఏం చేశాడు? అనే కథతో ఈ చిత్రం సాగుతుంది.
 
కిరణ్‌గారు ఈ కథ వెంటనే సినిమా చేద్దామన్నారు. ఛోటాగారు కూడా ఈ కథ విని బాగా ఎంజాయ్ చేశారు. ఈ కథలో ఎగ్జయిట్‌మెంట్ ఉంది కాబట్టే, వీరితో పాటు ఇతర చిత్రబృందానికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నన్ను, కథను నమ్మి సందీప్ ఈ చిత్రం అంగీకరించాడు. రమణ గోగులగారు స్వరపరచిన పాటలు విజయం సాధించాయి. మూడు పాటలూ సందర్భానుసారంగా సాగుతాయి. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement