
నేడు పులివెందులకు వైఎస్ జగన్ రాక
పులివెందుల:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పులివెందులకు రానున్నారు. ఆయన మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి బుధవారం ఉదయం ముద్దనూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి పులివెందులకు వెళతారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం లింగాల మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయిన వేరుశెనగ, అరటి, చీనీ, కరివేపాకు పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత వేంపల్లెకు చేరుకుని ఇటీవల వివాహమైన వేంపల్లె ముస్లిం మైనార్టీ నాయకుడు మునీర్ బాషా సోదరుని కుమార్తె షిమియా, మహబూబ్ బాషా దంపతులను ఆశీర్వదిస్తారు. గురువారం వేముల మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు.