crash land
-
ఫ్లాష్ బ్యాక్: ఒక ఉపగ్రహం కూలిన వేళ
కొన్నేళ్ల క్రితం చంద్రయాన్–2ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చందమామ మీద నేలకూలి్చన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇలా ఇస్రో నేలకూలి్చన శాటిలైట్లలో అదే మొదటిది కాదు. చంద్రయాన్ 1ను పదేళ్ల క్రితమే ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేసింది. అది 2008. నవంబర్ 14. మధ్యాహ్న వేళ. ఉక్కపోత చుక్కలు చూపుతోంది. గుజరాత్‌లోని రాజ్ కోట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ శివాలెత్తుతున్నాడు. మహా మహా ఇంగ్లండ్ పేస్ బౌలర్లను వీర బాదుడు బాదుతున్నాడు. కేవలం 78 బంతుల్లో అతను చేసిన 138 పరుగుల సాయంతో భారత్ మరపురాని విజయం సాధించింది. దేశమంతా సంబరాల్లో మునిగి పోయింది. కానీ, అదే సమయంలో అక్కడికి 1,600 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరులో పరిస్థితి మరోలా ఉంది. మరో దారిలేని పరిస్థితుల్లో, ఒక మినీ విస్ఫోటనానికి ఇస్రో భారంగా సిద్ధమవుతోంది. ఎందుకా విస్ఫోటనం? ఏమా కథ? అసలేం జరిగింది? చూద్దాం రండి...! 2008 అక్టోబర్ 22న చంద్రయాన్ మిషన్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. భూ కక్ష్యకు ఆవలికి శాటిలైట్‌ను పంపడం భారత్‌కు అదే తొలిసారి. అప్పటిదాకా రష్యా, అమెరికా, జపాన్, యూరప్ స్పేస్ ఏజెన్సీల పేరిట ఉన్న ఘనత అది. చంద్రునిపై నీటి ఆనవాళ్లను తొలిసారిగా ప్రపంచానికి పట్టిచి్చన ప్రయోగంగా చంద్రయాన్ చరిత్రలో నిలిచిపోయింది. అయితే అందరికీ తెలిసిన ఈ ఘనత వెనక బయటికి తెలియని మరో గాథ దాగుంది... ప్రోబ్... కూలేందుకే ఎగిరింది చంద్రయాన్ లో భాగంగా 32 కిలోల బరువున్న మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ను చంద్రునిపైకి పంపింది ఇస్రో. ► 2008 నవంబర్ 17వ తేదీ రాత్రి 8 గంటల వేళ ఇంపాక్ట్ ప్రోబ్‌ను చంద్రుని ఉపరితలం మీద కావాలనే కుప్పకూల్చేందుకు సిద్ధమైంది. ► అందులో భాగంగా చంద్రునికి దాదాపు 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ప్రోబ్ తన అంతిమ ప్రయాణానికి సిద్ధమైంది. ► చంద్రయాన్ కక్ష్య నుంచి క్రమంగా విడివడటం మొదలు పెట్టింది. ► దానిలోని స్పినప్ రాకెట్లు జీవం పోసుకుని గర్జించాయి. అయితే, ప్రోబ్ వేగాన్ని పెంచేందుకు కాదు, వీలైనంత తగ్గించేందుకు! చంద్రుని ఉపరితలం కేసి తిప్పి అనుకున్న విధంగా క్రాష్ చేసేందుకు!! ► ఎట్టకేలకు, చంద్రయాన్ మిషన్ నుంచి విడివడి అరగంటకు క్రాష్ ల్యాండ్ అయింది. ప్రోబ్ కథ అలా కంచికి చేరింది. ► తద్వారా, అంతదాకా అందరాని చందమామతో తొలిసారిగా కరచాలనం చేసి ఇస్రో కొత్త చరిత్ర సృష్టించింది. ఆ మూడింటి ముచ్చట్లు ప్రోబ్ లో మూడు పరికరాలను ఇస్రో పంపింది. అవి ఫొటోలు, వీడియోలు తీసి భూమికి పంపే వీడియో ఇమేజింగ్ సిస్టం, ప్రోబ్ చంద్రునిపైకి పడ్డ వేగాన్ని కొలిచేందుకు రాడార్ ఆల్టిమీటర్, చంద్రుని వాతావరణాన్ని విశ్లేíÙంచేందుకు మాస్ స్పెక్ట్రం మీటర్. భావికి బాటలు... కూల్చేయడమే అంతిమ లక్ష్యంగా ఇస్రో ప్రయోగించిన ’విఫల’ చంద్రయాన్ మిషన్ తర్వాతి రోజుల్లో చంద్రయాన్–2, చంద్రయాన్ –3 ప్రయోగాలకు బాటలు వేసింది. ఆగస్ట్ 23న చంద్రునిపై సగర్వంగా దిగి చంద్రయాన్–3 సాధించబోయే అంతిమ విజయం కోసం దేశమంతా ఇప్పుడు ఎదురు చూసేందుకు మూల కారణంగా నిలిచింది...! – సాక్షి, నేషనల్ డెస్క్ -
లాండింగ్ సమయంలో కుప్పకూలిన విమానం..
సోమాలియా: హల్లా ఎయిర్ లైన్స్ కు చెందిన ఒక విమానం సోమాలియా మొగదిషు విమానాశ్రయంలో క్రాష్ లాండింగ్ అయ్యింది. సిబ్బంది సహా అందులో ప్రయాణిస్తున్న సుమారు 34 మంది సురక్షితంగా బయటపడ్డారు. అడెన్ అడె విమానాశ్రయంలో ఒక విమానం సాంకేతిక లోపం కారణంగా వేగంగా రన్ వే మీదకు దూసుకొచ్చి క్రాష్ లాండింగ్ అయ్యింది. విమాన తాకిడికి ప్రహారీ కంచె తునాతునకలైంది. ఇంతటి ప్రమాదం జరిగినా కూడా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. లేచిన వేళా విశేషం బాగుంది కాబట్టే బ్రతికి బట్టకట్టామని ప్రయాణికులు షాక్ నుండి బయటపడి ఆశ్చర్యంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక విలేఖరి ఒకరు వీడియోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హల్లా ఎయిర్ లైన్స్ కు చెందిన E 120 తరహా విమానం అడెన్ అడె అంతర్జాతీయ విమానాశ్రయంలో 5వ నెంబర్ రన్ వే మీద క్రాష్ లాండింగ్ అయ్యింది. సోమాలియా సివిల్ ఏవియేషన్ అధారిటీ తెలిపిన వివరాల ప్రకారం విమానంలో 34 మంది పాసింజర్లు ఉండగా అందరూ సురక్షితంగా బయట పడ్డారని ఒక్కరికి మాత్రమే చిన్న చిన్న గాయాలయ్యాయని తెలిపారు. వీడియో చూశాక అందులోని వారికెవ్వరికీ ఏమీ కాలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. Video of aircraft type E120, operated by HALLA AIRLINE, crash landing on Runway 05 at Aden Ade International Airport (AAIA) today, at 12:23pm local time. All 34 crew and passengers on board have survived according to the Somali Civil Aviation Authority . One person suffered… pic.twitter.com/tMrX7mcxsY — Harun Maruf (@HarunMaruf) July 11, 2023 ఇది కూడా చదవండి: నాటో సమావేశాలు: ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ -
భూమ్మీద పడనున్న నాసా పాత ఉపగ్రహం
కేప్ కెనావెరల్ : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన 38 ఏళ్ల నాటి పాత ఉపగ్రహం ఒకటి అంతరిక్షం నుంచి భూమ్మీద పడబోతోంది. అయితే దీనివల్ల వచ్చే ముప్పు అత్యంత తక్కువని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 2,450 కేజీలున్న ఈ ఉపగ్రహం సేవా కాలం ముగిసిపోయింది. దీనిని అంతరిక్షంలో మండిస్తారు. అయినప్పటికీ ఆ ఉపగ్రహం శిథిలాలు చిన్న చిన్నవి భూమిపై పడే అవకాశాలున్నాయి. 9,400 శిథిలాల ముక్కల్లో ఒక్క దాని ద్వారా మాత్రమే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ది ఎర్త్ రేడియేషన్ బడ్జెట్ శాటిలైట్ (ఈఆర్బీఎస్) భూమిపైకి పడిపోనుంది. 1984లో ప్రయోగించిన ఈ ఉపగ్రహం రెండేళ్లు సేవలు అందించింది. సూర్యుడి నుంచి రేడియో ధార్మిక శక్తిని భూమి ఎలా గ్రహిస్తుందన్న దానిపై ఈ ఉపగ్రహం సేవలు చేసింది. 2005 నుంచి దీని సేవలు నిలిచిపోయాయి. -
విపత్కర సమయంలో సేవలందించిన పైలెట్‌కి దిమ్మతిరిగే షాక్ !
మాములుగా ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడూ పొరపాటున మన ముందున్న వాహనాన్ని ఢీ కొట్టిన అంత పెద్దమొత్తంలో జరిమాన పడదు. కానీ విమానం ల్యాండింగ్ చేసే సమయంలో దేన్నైనా ఢీ కొడితే కళ్లు తిరిగేలా ఎక్కువ మొత్తంలో జరిమాన విధిస్తారు. అచ్చం అలాంటి సంఘటన గాల్వియర్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే... మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్ విమానాశ్రయంలో పైలెట్లు కరోనా మహమ్మారీ సమయంలో అపారమైన సేవలందించి కోవిడ్ యోధులుగా పేరుతెచుకున్నారు. అలాంటి యోధులలో ఒకడైన పైలెట్ మజిద్ అక్తర్ తన కో పైలెట్ మే 6, 2021న బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ B 250 GT అనే విమానం గాల్వియర్ రన్‌వే పై క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. అంతేకాదు కరోనా బాధితులకు సంబంధించిన 71 రెమ్డిసివిర్ బాక్స్‌లను అహ్మదాబాద్ నుండి గ్వాలియర్‌కు తీసుకువెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ప్రమాదంలో పైలట్ మాజిద్ అక్తర్, కో-పైలట్ శివ్ జైస్వాల్, నాయబ్ తహసీల్దార్ దిలీప్ ద్వివేది సహా ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ విమానయాన సంస్థ మాత్రం విమానానికి నష్టం కలిగించినందుకు గానూ ఫైలెట్ మజిద్ అక్తర్‌కి దాదాపు రూ.85 కోట్ల బిల్లుని కట్టాల్సిందిగా తెలిపింది. అంతేకాదు ఈ విమానాలు దెబ్బతినడం వల్ల ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి విమానాలను కొనుగోలు చేయాల్సి వస్తుందంటూ ..సుమారు 60 కోట్లు ఖరీదు చేసే ఆ విమానానికి అదనంగా రూ 25 కోట్లు జోడించింది. దీంతో మజిద్ విమానానికి ఇన్సూరెన్స్ చేయకుండా ఎలా ఆపరేట్ చేయడానికి అనుమతించారని ప్రశ్నించాడు. అంతేకాదు ప్రమాదం ఎలా జరిగిందో కూడా తనకు తెలియదన్నాడు. అయినా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) కూడా తనకు ల్యాడింగ్ అయ్యేటప్పుడూ ఎటువంటి సూచనలు తెలియజేయాలేదని ఆరోపించాడు. ఈ మేరకు భారతదేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ అక్తర్ ఫ్లయింగ్ లైసెన్స్‌ను ఒక ఏడాదిపాటు నిషేధించింది. అంతేకాదు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. అయితే ఇన్సూరెన్స్ ప్రోటోకాల్‌ని అనుసరించకుండా విమానాన్ని ఎలా అనుమతించారనే దానిపై ప్రభుత్వం మౌనం వహించడం గమనార్హం. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ పూర్తైయ్యేవరకు అతని నేరస్తుడిగా పరిగణించకూడదని పేర్కొంది. (చదవండి: మా ఎంపిక సరైనదే అంటూ చైనా కొత్త పల్లవి) -
జాబిలి వైపు రాకెట్.. లాంఛ్ కాదు ఢీ కొట్టడానికి!
పరిశోధనల కోసం రాకెట్లను, శాటిలైట్లను అంతరిక్షంలోకి లాంఛ్ చేయడం సహజం. కానీ, ఇక్కడో రాకెట్ చంద్రుడ్ని ఢీ కొట్టే దూసుకెళ్తుండగా.. స్పేస్ ఏజెన్సీలన్నీ ఆసక్తిగా పరిశీలించబోతున్నాయి. అందుకు కారణాలు.. ఆ రాకెట్ ఎప్పుడో ఏడేళ్ల కిందట ప్రయోగించింది కావడం, ఇన్నాళ్లు స్పేస్‌లో కక్క్ష్య తప్పి అస్తవ్యస్తంగా సంచరించి ఇప్పుడు చంద్రుడి వైపు దూసుకెళ్లడం!. స్పేస్ఎక్స్ కంపెనీ ద్వారా ఫాల్కన్ 9 బూస్టర్ రాకెట్‌ను 2015 ఫిబ్రవరిలో అంతరిక్షంలోకి పంపించిన విషయం తెలిసిందే. అంతరిక్షంలోని లోతైన పరిస్థితుల్ని పరిశీలించడానికి ఈ రాకెట్‌ను ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు. మొదటి దశలో విజయవంతమైనప్పటికీ.. రెండో దశలో ఈ ప్రయోగం ప్లాప్ అయ్యింది. అయితే ఫాల్కన్ 9 బూస్టర్ అప్పటి నుంచి అస్తవ్యస్తమైన కక్క్ష్యను అనుసరించింది. దీంతో అదుపు తప్పి జాడ లేకుండా పోవడంతో స్పేస్ జంక్‌గా దాదాపు ఒక నిర్ధారణకు వచ్చేశారు సైంటిస్టులు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఆశ్చర్యకరరీతిలో ఈ రాకెట్ ట్రాక్ ఎక్కగా.. చంద్రుడి మీదకు క్రాష్ దిశగా దూసుకెళ్తుంది. నాసా అంచనాల ప్రకారం.. మార్చ్ 4వ తేదీన ఈ క్రాష్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి మిలియన్ మైళ్ల ట్రెక్‌లో అంతరిక్ష వాతావరణ ఉపగ్రహాన్ని పంపడం ద్వారా తన మొదటి డీప్-స్పేస్ మిషన్‌ను ప్రారంభించినప్పటికీ.. ఫాల్కన్ 9 బూస్టర్ కొంత అస్తవ్యస్తమైన కక్ష్యలో తిరుగాడింది. దీంతో ఈ రాకెట్ సంగతి పట్టించుకోవడం మానేశారు!. అయితే ఇన్నేళ్లకు ఇది చంద్రుడి వైపు కక్క్ష్యను మార్చుకుని దూసుకెళ్తోంది. సుమారు 4వేల కేజీల బరువున్న పాల్కన్ 9 బూస్టర్ రాకెట్.. ప్రస్తుతం గంటకు 9,000 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు పయనిస్తోంది. నాసా లునార్ ఆర్బిటర్(Lunar Reconnaissance Orbit)తో పాటు భారత్ చంద్రయాన్-2 స్పేస్‌క్రాఫ్ట్‌లు ఈ క్రాష్ ల్యాండ్‌ను అతి సమీపంగా గమనించనున్నాయి. అసలు ఈ క్రాష్ ల్యాండ్‌తో ఒరిగేది ఏముంటుందనే అనుమానం రావొచ్చు. చంద్రుడి ఉపరితలం మీది పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసం ఈ క్రాష్‌ల్యాండ్‌ను పరిశీలించనున్నారు. 2009లో నాసా కావాలనే ఒక రాకెట్‌ను చంద్రుడి మీదకు క్రాష్ లాంఛ్ చేసింది. అయితే పాల్కన్ విషయంలో అనుకోకుండా చంద్రుడి ఉపరితలంపైకి ఢీ కొడుతుండడం విశేషం. ఇది చంద్రుడ్ని ఢీ కొట్టడం ద్వారా జరిగే ప్రభావం అంతగా ఉండకపోవచ్చని స్పేస్ రీసెర్చర్లు భావిస్తున్నారు. క్లిక్ చేయండి: 5జీతో విమానాలకు ముప్పు పొంచి ఉందా? నిపుణుల మాటేంటంటే.. -
చంద్రునిపై కూలిపోయిన స్పేస్‌క్రాఫ్ట్
జెరుసలెం: ఇజ్రాయిల్‌కు చెందిన స్పేస్ క్రాఫ్ట్ చంద్రునిపై కూలిపోయింది. చంద్రునిపై స్పేస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయోల్ ‘స్మాల్ కంట్రీ బిగ్ డ్రీమ్స్’ పేరిట ఈ ప్రయోగాన్ని చేపట్టింది. గురువారం స్పేస్‌క్రాఫ్ట్ చంద్రునిపై ల్యాండ్ అవ్వాల్సి ఉంది. దీంతో ఈ ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను ఇజ్రాయిల్ టీవీతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రసారం చేశారు. అయితే చివరి నిమిషంలో ఈ ప్రయోగం విఫలమైంది. చంద్రునికి అత్యంత దగ్గరి కక్షలోకి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ మరికాసేట్లో ల్యాండ్ అవుతుందనగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కూలిపోయింది. దీనిపై ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ జీఎం ఓపెర్ డోరాన్ మాట్లాడుతూ.. తాము అనుకున్నట్టుగా ప్రయోగం విజయవంతం కాలేదని తెలిపారు. దీంతో నిరాశకు గురికావద్దని ఈ మిషన్ కోసం పనిచేసిన వారికి సూచించారు. అయినా ఇది ఒక్క గొప్ప విజయమేనని వ్యాఖ్యానించారు. కాగా, ఫ్లోరిడాలోని కేఫ్ కానవెరాల్ నుంచి ఫిబ్రవరి 21వ తేదీన ఇజ్రాయెల్‌కు చెందిన తొలి మూన్ లాండర్‌ను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. 585 కిలోల బరువున్న ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపించారు. ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనాకు చెందిన స్పేస్‌క్రాఫ్టులు మాత్రమే చంద్రునిపై అడుగుపెట్టాయి. మొత్తంగా ఏడు దేశాలు చంద్రునిపై స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండ్ చేయడానికి ప్రయత్నించగా మూడు మాత్రమే విజయం సాధించాయి. -
రోడ్డుపై విమానం ల్యాండ్ .. తప్పిన ప్రమాదం
కాలిఫోర్నియా : విమానం రన్‌వే పై ల్యాండ్ అవ్వడం చూస్తుంటాం. కానీ ఓ మహిళా పైలట్ విమానాన్ని అత్యవసరంగా నడిరోడ్డుపై ల్యాండ్ చేసింది. ఈ ఘటన కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్ రోడ్డుపై చోటుచేసుకుంది. విమానం ల్యాండ్ అవ్వడం చూసి వాహనదారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమై కార్లను రోడ్డు పక్కకు తీసుకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతేకాక ఆ సమయంలో రద్దీ కూడా చాలా తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం జరగలేదు. సాంకేతిక లోపం వల్ల పైలట్ రోడ్డుపై ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. విమానంలో గాల్లో ఉన్నప్పుడు ఇంజిన్‌లో సమస్య రావడంతో ట్రైనీ పైలట్ రోడ్డుపై ల్యాండ్ చేసింది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు అక్కడి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రయాణిస్తున్న కారుపై విమానం ల్యాండ్ అవ్వటంతో డ్రైవర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే కారు వేగాన్ని తగ్గించి సైడ్ తీసుకున్నాడు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రమాదం ముంచుకొస్తుంటే లగేజీల గొడవెందుకు?
దుబాయ్: దూకండి... దూకండి... బయటకు దూకండి! లగేజీని వదిలేయండి...ముందు మీరు బయటపడండి, బయటకు జారిపోండి! తిరువనంతపురం నుంచి దూబాయ్‌కి చేరుకున్న ఎమిరేట్స్ విమానం బుధవారం విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయినప్పుడు ఫ్లైట్ అటెండెంట్ ప్రయాణికులను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు ఇవి. ఓ పక్క ప్రమాదం ముంచుకొస్తున్నా ప్రయాణికులు మాత్రం తమ లగేజీలను వెంట తీసుకెళ్లేందుకే ప్రయత్నించిన విషయం తెల్సిందే. కొంత మంది తమ ఖరీదైన లాప్టాప్ల గురించి వెతుక్కోవడం కూడా ఓ వీడియో ఫుటేజ్‌లో కనిపించింది. ఇలాంటి విపత్కర సమయాల్లో 90 సెకండ్లలో విమానం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించడం విమానం సిబ్బంది బాధ్యత. ఎందుకు ఇలా 90 సెకండ్లలోనే ఖాళీ చేయించాల్సి ఉంటుందంటే. ఆ తర్వాత విమానంలో మంటలు తీవ్రమవుతాయనే విషయాన్ని పలు అధ్యయనాల ద్వారా వెల్లడైనట్లు వైమానిక నిపుణుడు ఆశ్లీ న్యూన్స్ తెలిపారు. అందుకనే ఎమిరేట్స్ విమాన సిబ్బంది నిర్దేశిత సమయంలో ప్రయాణికులను ఖాళీ చేయించేందుకు అవసరమైన హెచ్చరికలు చేస్తూ వచ్చారు. చివరకు తమ లగేజీలను తీసుకొని ప్రయాణికులు విమానాన్ని ఖాళీ చేశారు. అందుకు నిమిషంపైనే పట్టింది. రన్‌వేపై జారిపోతున్న విమానం ఇంజన్ నుంచి మంటలు చెలరేగడం కూడా 1.23 సెకండ్ల వీడియో ఫుటేజ్‌లో కనిపించింది. అంటే అర నిమిషం లేటైనా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలేసేవే. ఇలా ప్రాణం మీదకు వచ్చినప్పుడు కూడా మానవులు తమ బ్యాగ్‌లు, లాప్‌ట్యాప్‌లు, పాస్‌పోర్టులు, పర్సులు, ఇంటి తాళం చేతుల కోసం ఎందుకు వెతుకుతారు? ప్రాణంకన్నా వస్తువులపై మమకారం ఎక్కువా? ఒక్క ఎమిరేట్స్ విమానం విషయంలోనే ఇది జరగలేదు. గతేడాది సెప్టెంబర్ నెలలో బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన విమానం లాస్ వెగాస్ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు కూడా ప్రయాణికులు ఇలాగే వ్యవహరించారు. 2013, జూలై నెలలో ఆసియాన విమానం శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో క్రాష్ ల్యాండింగ్‌కు గురైనప్పుడు కూడా ప్రయాణికులు తమ లగేజ్ల కోసం ఇలాగే వెంపర్లాడడం కనిపించింది. మానవుడి నైజమే ఇంత! అని ఒక్కమాటలో సమాధానం చెప్పవచ్చునేమోగానీ ఈ విషయంలో మానవ మేథస్సుపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులను కంప్యూటర్ ద్వారా విశ్లేషించడం సాధ్యం కాదు. ఎందుకంటే జీవన్మరణ సమస్యను అందులో సృష్టించలేం. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఎమిరేట్స్ విమానం ఫుటేజ్ వైమానిక సిబ్బంది ‘సేఫ్టీ డ్రిల్స్’కు ఎంతో ఉపయోగపడగలదు. ఇక ముందు ప్రయాణికులకు కూడా ఎలాంటి శిక్షణ ఇవ్వాలో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. -
ప్రమాదం ముంచుకొస్తుంటే లగేజీల గొడవెందుకు?