కాలిఫోర్నియా : విమానం రన్‌వే పై ల్యాండ్ అవ్వడం చూస్తుంటాం. కానీ ఓ మహిళా పైలట్ విమానాన్ని అత్యవసరంగా నడిరోడ్డుపై ల్యాండ్ చేసింది. ఈ ఘటన కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్ రోడ్డుపై చోటుచేసుకుంది. విమానం ల్యాండ్ అవ్వడం చూసి వాహనదారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమై కార్లను రోడ్డు పక్కకు తీసుకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతేకాక ఆ సమయంలో రద్దీ కూడా చాలా తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం జరగలేదు. సాంకేతిక లోపం వల్ల పైలట్ రోడ్డుపై ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది.
విమానంలో గాల్లో ఉన్నప్పుడు ఇంజిన్‌లో సమస్య రావడంతో ట్రైనీ పైలట్ రోడ్డుపై ల్యాండ్ చేసింది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు అక్కడి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రయాణిస్తున్న కారుపై విమానం ల్యాండ్ అవ్వటంతో డ్రైవర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే కారు వేగాన్ని తగ్గించి సైడ్ తీసుకున్నాడు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment