Jared Isaacman: మొట్టమొదటి ప్రైవేట్‌ స్పేస్‌వాక్‌ | First Private Spacewalk in SpaceX Capsule Achieves New Milestone | Sakshi
Sakshi News home page

Jared Isaacman: మొట్టమొదటి ప్రైవేట్‌ స్పేస్‌వాక్‌

Published Fri, Sep 13 2024 4:49 AM | Last Updated on Fri, Sep 13 2024 5:55 AM

First Private Spacewalk in SpaceX Capsule Achieves New Milestone

రికార్డుకెక్కిన బిలియనీర్‌ జేర్డ్‌ ఐజాక్‌మాన్‌  

స్పేస్‌ఎక్స్‌ సంస్థ మరో ఘనత   

కేప్‌ కెనావెరాల్‌:  ప్రైవేట్‌ అంతరిక్ష నౌకలో నింగిలోకి వెళ్లి, స్పేస్‌వాక్‌ చేసిన మొట్టమొదటి నాన్‌–ప్రొఫెషనల్‌ వ్యోమగామిగా బిలియనీర్, టెక్నాలజీ వ్యాపారవేత్త జేర్డ్‌ ఐజాక్‌మాన్‌(41) రికార్డు సృష్టించారు. గురువారం భూమి నుంచి దాదాపు 1,400 కిలోమీటర్ల ఎగువన ‘డ్రాగన్‌’ స్పేస్‌ క్యాప్సూల్‌ నుంచి బయటకు వచి్చ, దాదాపు 15 నిమిషాల పాటు అంతరిక్షంలో విహరించారు. 

అక్కడి నుంచి భూగోళాన్ని తిలకించారు. పరిపూర్ణమైన ప్రపంచాన్ని కళ్లారా దర్శించానని ఆయన పేర్కొన్నారు. ఐజాక్‌మాన్‌ తర్వాత స్పేస్‌ఎక్స్‌ ఇంజనీర్‌ సారా గిల్లిస్‌ స్పేస్‌వాక్‌ చేశారు. అనంతరం మరో ఇద్దరు డ్రాగన్‌ క్యాప్సూల్‌ నుంచి బయటికొచ్చి అంతరిక్ష నడకలో పాల్గొన్నారు. స్పేస్‌ఎక్స్‌ తలపెట్టిన ‘పోలారిస్‌ డాన్‌’ ప్రాజెక్టులో భాగంగా ఫాల్కన్‌–9 రాకెట్‌ ద్వారా మంగళవారం ఐజాక్‌మాన్‌ సహా మొత్తం నలుగురు అమెరికాలోని ఫ్లోరిడా నుంచి అంతరిక్షంలోకి బయలుదేరారు. 

గురువారం తమ లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఇప్పటిదాకా ప్రొఫెషనల్‌ వ్యోమగాములకు మాత్రమే పరిమితమైన స్పేస్‌వాక్‌ను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్‌ సంస్థ వ్యాపారాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎలాన్‌ మస్క్‌తోపాటు ఐజాక్‌మాన్‌ భారీగా∙పెట్టుబడి పెట్టారు. ఆయన పెట్టుబడి ఎంత అనేది బహిర్గతం చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి ప్రైవేట్‌ అంతరిక్ష యాత్రలు ఊపందుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement