Polaris
-
Polaris Dawn: తిరిగొచ్చిన స్పేస్‌వాకర్లు
స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రైవేట్ స్పేస్‌వాక్ ప్రాజెక్టు ‘పొలారిస్ డాన్’ విజయవంతమైంది. అందులో భాగంగా ఐదు రోజుల క్రితం అంతరిక్షానికి వెళ్లడమే గాక వ్యోమగామిగా అనుభవం లేకున్నా స్పేస్‌వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన కుబేరుడు జరేద్ ఇసాక్‌మాన్ ఆదివారం సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. ఆయన, మరో ముగ్గురు సిబ్బందితో కూడిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలో ఫ్లోరిడాలోని డై టార్టగస్ బీచ్ సమీప సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. ఇసాక్మాన్తోపాటు ఇద్దరు స్పేస్ఎక్స్ ఇంజనీర్లు, ఒక మాజీ ఎయిర్‌ఫోర్స్ థండర్బర్డ్ పైలట్ కూడా ఈ క్యాప్సూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లడం తెల్సిందే. భూమి నుంచి 740 కి.మీ. ఎత్తులో తొలుత ఇసాక్‌మాన్, తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ స్పేస్‌వాక్ చేశారు. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ గరిష్టంగా భూమి నుంచి ఏకంగా 875 మైళ్ల ఎత్తుకు వెళ్లి మరో రికార్డు సృష్టించింది. చంద్రుడిపైకి నాసా అపోలో మిషన్ల తర్వాత మానవులు ఇంత ఎత్తుకు వెళ్లడం ఇదే తొలిసారి! ప్రైవేట్ రంగంలో స్పేస్‌వాక్ చేసిన తొలి వ్యక్తిగా, మొత్తమ్మీద 264వ వ్యక్తిగా ఇస్సాక్‌మాన్ నిలిచారు. ఆయన, గిలిస్ దాదాపు రెండు గంటల పాటు క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి స్పేస్ఎక్స్ నూతన స్పేస్‌సూట్‌ను పరీక్షించారు. గిలిస్ అంతరిక్షం నుంచే సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా స్టార్‌వార్స్ థీమ్ సాంగ్‌కు వయోలిన్ వాయించి రికార్డు సృష్టించడం తెలిసిందే. – కేప్ కనావరెల్ -
అంతరిక్షం నుంచి ఐక్యతా గీతం
అంతరిక్షంలో తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ చేసిన వ్యోమగాముల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా ‘స్టార్‌వార్స్: ద ఫోర్సెస్ అవేకెన్స్’లోని ప్రఖ్యాత ‘రేస్ థీమ్’ను అంతరిక్షం నుంచే పర్ఫామ్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. పొలారిస్ డాన్ ప్రైవేట్ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్ఎస్కు ప్రయాణించిన స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక నుంచే ఆమె ఈ మ్యూజికల్ ట్రిబ్యూట్లో పాల్గొన్నారు. సోలో వయోలిన్‌ను సారా వాయించగా పూర్తిస్థాయి ఆర్కెస్ట్రా బృందం భూమి నుంచి ఆమెకు వాద్య సహకారం అందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘హార్మనీ ఆఫ్ రెసీలియన్స్’ పేరిట పొలారిస్ ప్రోగ్రాం బృందం శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘‘విశ్వభాష అయిన సంగీతమే ఈ వీడియోకు స్ఫూర్తి. అలాగే బాలల్లో క్యాన్సర్ తదితర మహమ్మారులపై పోరాటం కూడా. చుక్కలనంటే ఉన్నత ఆశయాలను నిర్దేశించుకునేలా తర్వాతి తరాన్ని ప్రేరేపించడమే దీని ఉద్దేశం’’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంది. ‘అందమైన మన పుడమి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ ఆనంద క్షణాలను సంగీతమయంగా మార్చి మీ అందరితో పంచుకునేందుకు చేసిన ఓ చిన్న ప్రయత్నమిది’ అంటూ సారా గొంతుతో వీడియో ముగుస్తుంది. ‘‘మానవాళి ఐక్యతకు, మెరుగైన ప్రపంచపు ఆకాంక్షలకు ఈ ప్రయత్నం ఓ ప్రతీక. బాలల్లో నిబిడీకృతమై ఉండే అనంతమైన ప్రతిభా పాటవాలకు ఇది అంకితం’’ అని సారా పేర్కొన్నారు. పొలారిస్ డాన్ మిషన్ కమాండర్ జరేద్ ఐజాక్‌మ్యాన్‌తో పాటు సారా గురువారం స్పేస్ వాక్ చేయడం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి నాన్ ప్రొఫెషనల్ వ్యోమగాములుగా వారు నిలిచారు. ఈ వీడియో తయారీలో సెయింట్ జూడ్ చి్రల్డన్స్ రీసెర్చ్ హాస్పిటల్ కూడా పాలుపంచుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Jared Isaacman: మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్‌వాక్
కేప్ కెనావెరాల్: ప్రైవేట్ అంతరిక్ష నౌకలో నింగిలోకి వెళ్లి, స్పేస్‌వాక్ చేసిన మొట్టమొదటి నాన్–ప్రొఫెషనల్ వ్యోమగామిగా బిలియనీర్, టెక్నాలజీ వ్యాపారవేత్త జేర్డ్ ఐజాక్మాన్(41) రికార్డు సృష్టించారు. గురువారం భూమి నుంచి దాదాపు 1,400 కిలోమీటర్ల ఎగువన ‘డ్రాగన్’ స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు వచి్చ, దాదాపు 15 నిమిషాల పాటు అంతరిక్షంలో విహరించారు. అక్కడి నుంచి భూగోళాన్ని తిలకించారు. పరిపూర్ణమైన ప్రపంచాన్ని కళ్లారా దర్శించానని ఆయన పేర్కొన్నారు. ఐజాక్మాన్ తర్వాత స్పేస్ఎక్స్ ఇంజనీర్ సారా గిల్లిస్ స్పేస్‌వాక్ చేశారు. అనంతరం మరో ఇద్దరు డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి అంతరిక్ష నడకలో పాల్గొన్నారు. స్పేస్ఎక్స్ తలపెట్టిన ‘పోలారిస్ డాన్’ ప్రాజెక్టులో భాగంగా ఫాల్కన్–9 రాకెట్ ద్వారా మంగళవారం ఐజాక్మాన్ సహా మొత్తం నలుగురు అమెరికాలోని ఫ్లోరిడా నుంచి అంతరిక్షంలోకి బయలుదేరారు. గురువారం తమ లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఇప్పటిదాకా ప్రొఫెషనల్ వ్యోమగాములకు మాత్రమే పరిమితమైన స్పేస్‌వాక్‌ను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి స్పేస్ఎక్స్ సంస్థ వ్యాపారాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎలాన్ మస్క్‌తోపాటు ఐజాక్మాన్ భారీగా∙పెట్టుబడి పెట్టారు. ఆయన పెట్టుబడి ఎంత అనేది బహిర్గతం చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి ప్రైవేట్ అంతరిక్ష యాత్రలు ఊపందుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఆ ఊరు ధ్రువపు ఎలుగుబంట్లకు నిలయం!
ఒకప్పుడు సోవియట్ రష్యాలో అంతర్భాగమైన ఆ ఊరు పాతికేళ్లుగా ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం నార్వే అధీనంలోని స్వాల్బార్డ్ ద్వీపసమూహంలో ఉన్న ఈ ఊరి పేరు పిరమిడెన్. ఆర్కిటిక్ వలయానికి చేరువలో ఉన్న ఈ ద్వీప సమూహంలో ఏడాది పొడవునా హిమపాతం ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడి కొండ దిగువ ఉన్న గని నుంచి బొగ్గును వెలికి తీసేవారు. గని కార్మికులు, ఇతర ఉద్యోగుల కోసం ఇక్కడ ఈ ఊరు ఏర్పడింది. అప్పట్లో దాదాపు వెయ్యిమంది వరకు ఇక్కడ ఉండేవారు. ఈ ఊళ్లో చర్చి, గ్రంథాలయం, పాఠశాల, క్రీడా ప్రాంగణం, ఇరవై నాలుగు గంటలూ పనిచేసే క్యాంటీన్ వంటి సౌకర్యాలు ఉండేవి. పాతికేళ్ల కిందట ఇక్కడ బొగ్గు నిల్వలు అంతరించిపోవడంతో ఊరి జనాభా అంతా ఇతరేతర ప్రాంతాలకు ఉపాధి కోసం తరలిపోయారు. ఊరి వెలుపల కాపలాగా ఉండే సైనిక సిబ్బంది తప్ప ఊళ్లోకి వెళితే మనుషులెవరూ కనిపించరు. వీథుల్లో యథేచ్ఛగా సంచరిస్తున్న ధ్రువపు ఎలుగుబంట్లు మాత్రమే కనిపిస్తాయి. నిరంతర హిమపాతంతో మంచుదుప్పటి కప్పుకున్నట్లుగా కనిపించే ఈ ఊరు ఇప్పుడు ధ్రువపు ఎలుగుబంట్లకు ఆలవాలంగా మారింది. (చదవండి: ద్వీపం పుట్టడం చూశారా? కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యం!) -
దూకుడు
పొలారిస్.. వెహికల్ లవర్స్‌కు నిజంగానే ఓ గిఫ్ట్. వాటి దూకుడుకు, డిజైన్‌కు ఎవరైనా మనసు పారేసుకోవాల్సిందే. కొండల్లో.. గుట్టల్లో.. గడ్డకట్టిన మంచులో.. బురదపొలాల్లో.. పొలారిస్ దూకుడుకు ఏ వెహికల్ సాటిరాదు. అందుకే రోడ్లపై ప్రయాణించడానికి ఈ వెహికల్‌కు అనుమతి లేకున్నా లక్షలు ఖర్చు పెట్టి లక్షణంగా కొనేస్తున్నారు నగరవాసులు. ఫాంహౌస్‌లో పొలాలను చూడటానికి, కొండలపై టూర్‌కు వెళ్లడానికి వీటిని ప్రత్యేకంగా వినియోగించుకుంటున్నారు. పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా పొలారిస్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. రకరకాలఫీచర్స్తో వెహికల్ లవర్స్ మనసు దోచేస్తున్న వీటి విశేషాలు తెలుసుకోవాలంటే వూదాపూర్లోని పొలారిస్ షోరూమ్‌కు వెళ్లాల్సిందే. - శిరీష చల్లపల్లి స్పోర్ట్స్వూన్ ఏసీఈ 350 → 32 హెచ్పీప్రొటెస్టర్ ఇంజిన్ → సింగల్ ప్యాసింజర్ క్యాబ్ డిజైన్ → రేర్ కార్గో బాక్స్ → ధర రూ. 9.5 లక్షలు ఆర్‌జెడ్ఆర్- 170 → పిల్లల కోసమే (10 ఏళ్లు) ప్రత్యేకంగా తయారు చేసిన వాహనం ఇది → పేరెంట్స్ దీని వేగాన్ని కంట్రోల్ చేయువచ్చు → హెల్మట్, సేఫ్టీఫ్లాగ్, ఎలా నడపాలో తెలిపే డీవీడీ ఉండడం దీని ప్రత్యేకత → ఇది ఫోర్‌స్ట్రోక్ సింగిల్ ఇంజిన్ → ధర రూ. 6.2 లక్షలు హాక్ ఐ-400 → 455 సీసీ హై అవుట్‌పుట్ ఇంజిన్ → స్మూత్ రియర్ సస్పెన్షన్ → హైగ్రౌండ్ క్లియరెన్స్ → ధర రూ.6.5 లక్షలు స్పోర్ట్స్వూన్-90 → ఇది టీనేజర్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన బైక్ → ఎలక్ట్రిక్ స్టార్టర్, స్పీడ్ అడ్జెస్టబుల్ లిమిటర్, ఎలా నడపాలో తెలిపే డీవీడీ ఉండటం దీని ప్రత్యేకత → 4 స్ట్రోక్ ఇంజిన్‌తో రూపొందించారు → ధర రూ.3.9 లక్షలు