దూకుడు
పొలారిస్.. వెహికల్ లవర్స్‌కు నిజంగానే ఓ గిఫ్ట్. వాటి దూకుడుకు, డిజైన్‌కు ఎవరైనా మనసు పారేసుకోవాల్సిందే. కొండల్లో.. గుట్టల్లో.. గడ్డకట్టిన మంచులో.. బురదపొలాల్లో.. పొలారిస్ దూకుడుకు ఏ వెహికల్ సాటిరాదు. అందుకే రోడ్లపై ప్రయాణించడానికి ఈ వెహికల్‌కు అనుమతి లేకున్నా లక్షలు ఖర్చు పెట్టి లక్షణంగా కొనేస్తున్నారు నగరవాసులు. ఫాంహౌస్‌లో పొలాలను చూడటానికి, కొండలపై టూర్‌కు వెళ్లడానికి వీటిని ప్రత్యేకంగా వినియోగించుకుంటున్నారు. పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా పొలారిస్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. రకరకాలఫీచర్స్‌తో వెహికల్ లవర్స్ మనసు దోచేస్తున్న వీటి విశేషాలు తెలుసుకోవాలంటే వూదాపూర్‌లోని పొలారిస్ షోరూమ్‌కు వెళ్లాల్సిందే. - శిరీష చల్లపల్లి
స్పోర్ట్స్‌వూన్ ఏసీఈ 350
→ 32 హెచ్‌పీప్రొటెస్టర్ ఇంజిన్
→ సింగల్ ప్యాసింజర్ క్యాబ్ డిజైన్
→ రేర్ కార్గో బాక్స్
→ ధర రూ. 9.5 లక్షలు
ఆర్‌జెడ్‌ఆర్- 170
→ పిల్లల కోసమే (10 ఏళ్లు) ప్రత్యేకంగా తయారు చేసిన వాహనం ఇది
→ పేరెంట్స్ దీని వేగాన్ని కంట్రోల్ చేయువచ్చు
→ హెల్మట్, సేఫ్టీఫ్లాగ్, ఎలా నడపాలో తెలిపే డీవీడీ ఉండడం దీని ప్రత్యేకత
→ ఇది ఫోర్‌స్ట్రోక్ సింగిల్ ఇంజిన్
→ ధర రూ. 6.2 లక్షలు
హాక్ ఐ-400
→ 455 సీసీ హై అవుట్‌పుట్ ఇంజిన్
→ స్మూత్ రియర్ సస్పెన్షన్
→ హైగ్రౌండ్ క్లియరెన్స్
→ ధర రూ.6.5 లక్షలు
స్పోర్ట్స్‌వూన్-90
→ ఇది టీనేజర్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన బైక్
→ ఎలక్ట్రిక్ స్టార్టర్, స్పీడ్ అడ్జెస్టబుల్ లిమిటర్, ఎలా నడపాలో తెలిపే డీవీడీ ఉండటం దీని ప్రత్యేకత
→ 4 స్ట్రోక్ ఇంజిన్‌తో రూపొందించారు
→ ధర రూ.3.9 లక్షలు