స్పేస్ఎక్స్ ప్రయోగంలో భారీ పేలుడు | SpaceX's Falcon 9 explodes on Florida | Sakshi
Sakshi News home page

స్పేస్ఎక్స్ ప్రయోగంలో భారీ పేలుడు

Published Fri, Sep 2 2016 2:26 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

స్పేస్ఎక్స్ ప్రయోగంలో భారీ పేలుడు

స్పేస్ఎక్స్ ప్రయోగంలో భారీ పేలుడు

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసా ప్రయోగ కేంద్రం సమీపంలో స్పెస్‌ఎక్స్ లాంచింగ్ సందర్భంగా పెద్ద పేలుడు కలకలం సృష్టించింది. రొటీన్ రాకెట్ ప్రయోగం సందర్భంగా.. ఉదయం 9 గంటల సమయంలో మానవరహిత స్పేస్ ఎక్స్‌ను పరీక్షిం చేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నాసా వెల్లడించింది.

కెన్నెడీ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం పక్కనే ఉన్న కేప్ కార్నివాల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో జరిగిన ఈ పేలుడుతో కొన్ని మైళ్ల దూరం వరకున్న భవనాల్లో అద్దాలు పగిలిపోయాయి. కాగా, మొదటి పేలుడు జరిగిన కాసేపటికే మరో రెండుసార్లు పేలుళ్లు జరిగాయంటున్నా.. పూర్తి వివరాలింకా వెల్లడికాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement