కాలిఫోర్నియా: అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకేసారి 60 ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించింది. ఫాల్కన్–9 అనే రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టారు. ఫ్లోరిడాలోని కేప్ కనరవల్ నుంచి 60 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ శాటిలైట్స్ ద్వారా ఇక నుంచి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. స్టార్‌లింక్ నెట్‌వర్క్‌లో భాగంగా సుమారు 12వేల స్పేస్‌క్రాఫ్ట్‌లను నింగిలోకి పంపాలని ఎలన్ మస్క్ కంపెనీ భావిస్తోంది. ఇంటర్నెట్ సేవల కోసం స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రైవేటుగా శాటిలైట్‌లను ప్రయోగిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment