ఫ్లోరిడా: అంతర్జాతీయ స్పేస్ సెంటర్‌కు(ఐఎస్‌ఎస్) ముగ్గురు వ్యోమగాములను తీసుకెళ్లాల్సిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ‘ఎండీవర్’ ప్రయాణం శనివారం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే ప్రయాణం వాయిదా పడిందని ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ వెల్లడించింది.
పై గాలులు వీయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపింది. అన్నీ అనుకూలిస్తే ఆదివారం రాత్రి రాకెట్‌ను నింగిలోకి పంపించేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్‌లో క్రూ డ్రాగన్ ఎండీవర్‌ను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు పంపించనున్నారు.
ఈ ప్రయాణం ఇప్పటికే ఫిబ్రవరి22న తొలిసారి వాయిదా పడింది. స్పేస్‌ఎక్స్ కంపెనీ 2020 నుంచి వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌కు పంపిచే విషయంలో నాసాకు వాణిజ్యపరమైన సేవలందిస్తోంది. ఈ విషయంలో స్పేస్ ఎక్స్‌తో ప్రముఖ ఏవియేషన్ కంపెనీ బోయింగ్ త్వరలో పోటీపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment