లాంచ్‌ప్యాడ్ వద్ద ఉంచిన ఓ రాకెట్ ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరి పేలిపోయిన ఘటన చైనాలో చోటుచేసుకొంది. అయితే పర్వత ప్రాంతంలో ఈ రాకెట్ పడిపోవడంతో నష్టం తప్పింది.
Chinas kommerzielle Trägerrakete Tianlong-3 ist bei einem Teststart abgestürzt.#China #XiJinping #Rocket #Space #SecretStory #Taiwan #Breaking #news #Explosion #USA pic.twitter.com/uIqaCFZHVG
— Brennende Frage (@brennende_frage) July 1, 2024
బీజింగ్ తియాన్‌లాంగ్ టెక్నాలజీ అండ్ కో సంస్థ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. తాము అభివృద్ధి చేస్తున్న తియాన్‌లాంగ్3 అనే రాకెట్ తొలి దశ భాగం ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపోయిందని, గాంగ్యీ పర్వత ప్రాంతంలో భారీ పేలుడుతో పడిపోయిందని వెల్లడించింది. అయితే అక్కడ జనావాసాలు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.
పేలుడు తర్వాత అగ్నిమాపక బృందాలు ఆ మంటల్ని ఆర్పేశాయి. తాజాగా దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
చైనాలో రాకెట్ ప్రయోగ రంగంలోకి ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇచ్చారు. దీంతో పలు కంపెనీలు తమ ప్రయోగశాలలను ఏర్పాటుచేశాయి. తియాన్‌లాంగ్3 రాకెట్‌ను చైనా స్కైడ్రాగన్ 3 పేరిట అభివృద్ధి చేస్తోంది.
ఇదిలా ఉంటే.. జూన్ 22న చైనా సిచువాన్ ప్రావిన్స్‌లో ఓ గ్రామంపై రాకెట్ శిథిలాలు కూలాయి. షీఛాంగ్ శాటిలైట్ సెంటర్ నుంచి లాంగ్‌మార్చ్2 రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే అవి జనావాసాలపై పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment