బీజింగ్: చైనా తన అంతరిక్ష సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది. సముద్రంలోని వేదికపై నుంచి చేపట్టిన ప్రయోగంలో ఏకంగా ఎనిమిది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. షాండోంగ్ ప్రావిన్స్‌లోని హయియాంగ్ సముద్రంలో చేపట్టిన ఈ ప్రయోగంలో జియెలాంగ్–3 రాకెట్‌ను ప్రయోగించింది.
ఈ ఘన ఇంధన రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడం ఇది రెండోసారి. సముద్రంలోని వేదికల పైనుంచి వాణిజ్య ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు చైనా ప్రత్యేకంగా ఈ రాకెట్‌ను అభివృద్ధి చేసుకుంది. ఓ షిప్‌నే ఇలా రూపుమార్చి మొబైల్ లాంచ్ పాడ్‌గా తయారు చేసింది. అంతర్జాతీయ జలాల్లో అనువైన స్థానాల నుంచి ప్రయోగాలు చేపట్టేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది.
డ్రోన్ యుద్ధ తంత్రం కోసం కొత్త యుద్ధ నౌక
యుద్ధ నౌకను డ్రోన్లతో మిళితం చేసి అభివృద్ధి పరిచిన కొత్త రకం యుద్ధ నౌకను చైనా నేవీ సోమవారం ప్రారంభించింది. డ్రోన్ క్యారియర్‌లా పనిచేస్తూ సైనికులతో అవసరం లేకుండా జరిగే నేలపైనా, నీటిలోనూ పోరాట పటిమను పెంచుతుందని ఓ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment