Shandong province
-
తాను వేసిన ఉచ్చులో..
లండన్: చైనాకు సమీపంలోని ఎల్లో సముద్రంలో పశ్చిమ దేశాల జలాంతర్గాములను నిరోధించడానికి తాను వేసిన ఉచ్చులో డ్రాగన్ దేశానికి చెందిన అణు జలాంతర్గామి చిక్కుకుంది. ఈ ప్రమాదంలో చైనాకు చెందిన 55 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ రహస్య నివేదిక తమ దగ్గర ఉందని డెయిలీ మెయిల్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆగస్టులో ఎల్లో సముద్రంలో చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతానికి సమీపంలో క్వింగ్డావ్ నౌకాదళ స్థావరం ఉంది. ఆక్కడికి అమెరికా, బ్రిటన్ల జలంతర్గాములు రాకుండా చైనా ఏర్పాటు చేసిన యాంకర్ ఉచ్చులో దాని సబ్‌మెరైన్ చిక్కుకుందని డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం ఎలా జరిగిందంటే.. ! ఈ సబ్‌మెరైన్ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ సవివరమైన నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఉన్న వివరాల ప్రకారం ఎల్లో సముద్రంలో ఆగస్టు 21 ఉదయం 8.12 గంటల సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన అణు జలంతర్గామి 093 చిక్కుకుపోయింది. అమెరికా, దాని మిత్రపక్షాల జలాంతర్గాముల్ని అడ్డుకోవడానికి వేసిన యాంకర్ చైన్‌ను డ్రాగన్ జలంతర్గామి ఢీ కొట్టడంతో అందులో ఎయిర్ ఫ్యూరిఫయర్, ఎయిర్ ట్రీట్మెంట్ వ్యవస్థలు ఆగిపోయి ఉండవచ్చు. సబ్‌మెరైన్‌లో ప్రయాణిస్తున్న సిబ్బంది ఆరుగంటల సేపు శ్రమించి ప్రత్యామ్నాయ వ్యవస్థకు మార్చినా ఫలితం లేకుండా పోయింది. జలాంతర్గామిలో ఉన్న ఆక్సిజన్ విషతుల్యమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడి అందులో ప్రయాణిస్తున్న 55 మంది ఉసురు తీసింది. మృతి చెందిన వారిలో జలాంతర్గామి కెప్టెన్ కల్నల్ జీ యాంగ్పెంగ్ సహా 22 మంది అధికారులు, ఏడుగురు ఆఫీసర్ కేడెట్స్, 9 మంది పెట్టీ ఆఫీసర్స్, 17 మంది సిబ్బంది ఉన్నారు. ఆగస్టులో ఈ ప్రమాదం గురించి కొన్ని అంతర్జాతీయ పత్రికలు రాసినా అప్పట్లో చైనా, తైవాన్లు దీనిని తోసిపుచ్చాయి. జలంతర్గాముల్లో హైడ్రోజన్ నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థలు ఉంటాయి. బహుశా చైనా జలాంతర్గామిలో ఆ వ్యవస్థ లేకపోయి ఉండవచ్చునని బ్రిటన్ నిపుణులు చెబుతున్నట్టుగా డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో సబ్మెరైన్నుంచి ఎన్క్రిప్టెడ్ ఆటోమేటిక్ సిగ్నల్ పొరుగు దేశాలకు అందాయని బ్రిటన్ నిపుణులు వెల్లడించారు. అదే సమయంలో బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రసంగం మధ్యలో వెళ్లిపోయారు. అధ్యక్షుడు ప్రసంగ పాఠాన్ని ఆ దేశ వాణిజ్య మంత్రి కొనసాగించారని, ఈ ప్రమాదమే దానికి కారణమన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. -
చైనాలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు..
బీజింగ్: చైనా తూర్పు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 5.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సంస్థ వెల్లడించింది. ప్రమాదంలో డజన్ల కొద్దీ భావనాలు నేలమట్టం కాగా 21 మంది మరణించినట్టు మీడియా వర్గాలు తెలిపాయి. 23 injured, buildings collapse as 5.4 earthquake hits east Chinahttps://t.co/JDhANJihBW pic.twitter.com/vnBgC3pOoa — Gulf Today (@gulftoday) August 6, 2023 దక్షిణ షెజోలోని శాండోంగ్ ప్రావిన్స్ లో ఆదివారం తెల్లవారుజాము 2.33 గంటలకు సంభవించిన ఈ భూకంపం ఉపరితలానికి 10కి.మీ. లోతున పుట్టిందని, సుమారు 26 కిలోమీటర్ల మేర ఇది ప్రభావం చూపిందని తెలిపింది యూఎస్ జియోలాజికల్ సంస్థ. భూకంపం తీవ్రతకు కనీసం 126 భవనాలు కుప్పకూలిపోయినట్లు తెలిపాయి శాండోంగ్ అధికారిక బృందాలు. Twenty-one injured in east #China magnitude 5.5 earthquake pic.twitter.com/JLF0pXXbo0 — DD India (@DDIndialive) August 6, 2023 కూలిన భవనాలు, గోడలతో రోడ్ల మీద ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న శిధిలాలే కనిపిస్తున్నాయి. ఈ విపత్తులో భూమి సుమారుగా 52 సార్లు కంపించడంతో సుమారుగా 21 మంది తీవ్రంగా గాయపడ్డారని, శిధిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చన్నారు అధికారులు. ఇంతవరకు ఎటువంటి ప్రాణ నష్టమైతే జరగలేదని వారు స్పష్టం చేశారు. 5.5 earthquake in eastern China pic.twitter.com/6xLHvQvYHK — Kim Green (@KimGree57363126) August 6, 2023 చాలా దశాబ్దాల తర్వాత చైనాలో ఈ స్థాయిలో భూకంపం చోటు చేసుకుందని దీని తీవ్రత కూడా జనాన్ని భయభ్రాంతులకి గురిచేసిందని స్థానికులు చెబుతున్నారు. భూకంపం సమయంలో తల తిరుగుతున్నట్లు అనిపించిందని ఒకరు సోషల్ మీడియాలో తెలపగా.. మరొకరు భూకంపం అదురుకు గుండె జారినట్లైందని వెంటనే భయంతో రోడ్ల మీదకు పరుగులు తీసినట్లు తెలిపారు. Earthquake hits eastern China, injuring 21 Follow us on Rumble: https://t.co/Nuc9nUzTc5 pic.twitter.com/g3vUynvjcA — RT (@RT_com) August 6, 2023 భూకంపం తాలూకు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు. ఈ వీడియోలు చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించి శాండోంగ్ కు సహాయాక బృందాలను పంపగా వారు సహాయక చర్యలకు ఉపక్రమించారు. అసలే భారీ వర్షాలతోనూ, వరదలతోనూ కొట్టుమిట్టాడుతున్న చైనాను ఈ భూకంపం మరింత కుదిపేసింది. ఇది కూడా చదవండి: పాకిస్తాన్ వధువు, భారత వరుడు.. మరో జంట కథ -
ఓరి దేవుడో! చైనాను హడలెత్తిస్తున్న కొత్త వైరస్, 35 కేసులు నమోదు
బీజింగ్: కరోనా వైరస్ ఇంకా అంతమవ్వనేలేదు. కోవిడ్ తీవ్రత తగ్గినప్పటికీ ప్రపంచ దేశాల్లో నిత్యం కేసులు నమోదవుతూనే ఉన్నాయి. భారత్‌లోనూ కోవిడ్ కేసులు వేలల్లో వెలుగు చూస్తున్నాయి. దీనికి తోడు మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక కరోనాకు పుట్టినిల్లుగా భావించే చైనాలో మరో కొత్త రకం వైరస్ హడలెత్తిస్తోంది. అదే లాంగ్యా హెనిపా వైరస్‌గా వైద్యులు గుర్తించారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. తూర్పు చైనాలోని హెనాన్, షాన్డాంగ్ ప్రావిన్సుల్లో ఇప్పటి వరకు 35 మందికి ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. జర్వంతో బాధపడుతున్న రోగుల గొంతు నుంచి సేకరించిన నమూనాల్లో లాంగ్యా వైరస్‌ను వైద్యులు గుర్తించారు. ఈ వైరస్ తీవ్రమైన ఇన్ఫెక్షన్ మనుషుల్లో మూడో వంతు మంది ప్రాణాలను తీయగలదని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు నమోదైన కేసులో ఎలాంటి మరణం సంభవించలేదు. అంతేగాక ఈ వైరస్ బారిన పడిన వారిలో కేవలం స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. పేషెంట్లు ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. లాంగ్యా వైరస్‌కు ఇప్పటి వరకూ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దాని లక్షణాలు, సమస్యల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. చదవండి: కరోనా అంతమెప్పుడో చెప్పిన చైనా నోస్ట్రాడమస్.. ఇది నిజమేనా! -
బంగారు గనిలో పేలుడు: 10 మంది దుర్మరణం
బీజింగ్/ జినాన్: చైనాలోని షాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న బంగారు గనిలో పేలుడు సంభవించిన రెండు వారాలకు ప్రమాదంలో చిక్కుకున్న వారి వద్దకు చేరుకున్నారు. రెండువారాల పాటు గనిలో చిక్కుకున్న వారిలో 10 మంది మృత్యువాత పడగా 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. జనవరి 10వ తేదీన బంగారు గనిలో ప్రమాదం సంభవించింది. అయితే ప్రమాదం జరిగిన విషయం మాత్రం 30 గంటల తర్వాత అధికారులకు తెలిసింది. దీంతో బాధితులను కాపాడే ప్రయత్నాలు ఆలస్యమయ్యాయి. విషయం తెలిసిన అనంతరం హుటాహుటిన నిపుణులను తరలించి వారిని వెలికితీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే భూగర్భంలో నీటి తాకిడి భారీగా ఉండడంతో సహాయ చర్యలకు ఆటంకంగా మారింది. గని ముఖద్వారంపై వెయ్యి అడుగుల లోతున 70 టన్నుల మట్టి కూరుకుపోవడంతో మరింత కష్టమైంది. వారిని బయటకు తీసేందుకు దాదాపు 15 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. లోపల ఉన్నవారి పరిస్థితిపై ఆందోళన చెందిన అధికారులు వీలైనంత త్వరగా బయటకు తీసుకొద్దామని ప్రయత్నించారు. రెండు వారాల పాటు తీవ్రంగా శ్రమించి ప్రమాదంలో చిక్కుకున్న వారిని 25వ తేదీన బయటకు తీసుకొచ్చారు. అయితే అధికారులు చేరుకునేలోపు 10 మంది మరణించగా, మరో 11 మంది ప్రాణాలతో ఉన్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. మరొక వ్యక్తి ఆచూకీ లభించలేదు. అతడి కోసం అధికారులు వెతుకున్నారు. అయితే గనిలో పేలుడుకు కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. చైనాలో మైనింగ్ పరిశ్రమలో ప్రమాదాలు తరచూ సంభవిస్తుంటాయి. ఏటా దాదాపు 5 వేల మంది మరణిస్తుంటారని ఆ దేశ మీడియా తెలిపింది. -
బోర్ కొట్టి.. డాడీ మనీ అంతా ధ్వంసంచేశాడు!
న్యూఢిల్లీ : చిన్న పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్తే ఎంత ప్రమాదమో మరోసారి రుజువైంది. అయితే ఈసారి కాస్త భిన్నంగా, తండ్రికి షాకిచ్చేలా ఓ చైనా పిల్లోడు అల్లరిఅల్లరి చేశాడు. బోర్ కొట్టిన ఆ పిల్లోడు ఇంట్లో తండ్రి దాచిన పెట్టిన లక్షల కొద్దీ నగదును ధ్వంసం చేశాడు. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ క్వింగ్డావోలోని గావ్ అనే వ్యక్తికి ఇంటికి వెళ్లగానే ఓ టెర్రిబుల్ సర్ ప్రైజ్ ఎదురైంది. తన ఐదేళ్ల కొడుకు తాను దాచిపెట్టిన నగదునంతా ముక్కలు ముక్కలుగా చించేసి, కనిపించాడు. మొత్తం 50వేల యువాన్లు అంటే 4,70,000 మేర నగదు ధ్వంసం చేశాడు. వెంటనే వాటిని తీసుకుని గావ్ బ్యాంకు వద్దకు ఎక్స్చేంజ్ కోసం పరిగెత్తినా లాభం లేకపోయింది. బ్యాంకు వారు కూడా వాటిని తీసుకోవడానికి నిరాకరించారు. సింపుల్ గా ఆ చిరిగిపోయిన నోట్లను ఎక్స్చేంజ్ గా తీసుకోవడానికి సమ్మతించమని చెప్పేశారు. కొంచెం అతికిపెట్టి తీసుకొచ్చినా వాటిని తీసుకుంటామని బ్యాంకు వారు తెలిపారు. బిజినెస్ కోసం క్రెడిటార్ల దగ్గర్నుంచి రావ్ ఈ నగదును తీసుకొచ్చాడు. అయితే ఈ విషయంలో తన కొడుకుని తప్పు పట్టాల్సినవసరం లేదని, తన కొడుకు చాలా చిన్నవాడని, అతను ఏమి చేస్తున్నాడో తనకే తెలియదని తండ్రి చెప్పాడు. -
ఓ మైగాడ్.. అతడు బతికాడు!
బీజింగ్: దురదృష్టం వెంటాడితే కాలు జారినా కాటికి పోతాం. అదృష్టముంటే ఆకాశం నుంచి పడినా ఆయువు తీరదు. చైనాకు చెందిన 46 వ్యక్తి మృత్యుముఖంలోంచి బయటపడ్డాడు. 1.5 మీటర్ల ఇనుప ఊచ దేహంలోకి దూసుకుపోయినా ప్రాణాలతో బయటపడ్డాడు. షాన్ డాంగ్ ప్రావిన్స్ లో నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న జాంగ్ అనే ఇంటి పేరు కలిగిన వ్యక్తి పనిచేస్తూ 5 మీటర్ల ఎత్తు నుంచి ఇనుప ఊచలపై పడిపోయాడు. ఈనెల 14న ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఇనుప ఊచలను కత్తిరించి అతడిని జినాన్ లోని షాన్ డాంగ్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి శరీరంలోకి చొచ్చుకుపోయిన 1.5 మీటర్ల ఇనుప రాడ్ ను డాక్టర్లు ఎంతో శ్రమించి బయటకు తీశారు. 7 గంటలకు పైగా శ్రమించి అతడి ప్రాణాలను నిలిపారు. కపాలం, శ్వాసనాళం, గుండె, గళధమని, కాలేయం పక్కనుంచి ఇనుపరాడ్ చొచ్చుకుపోయినట్టు ఎక్స్ రేలో కనబడింది. ప్రధాన అవయవాలకు ఏమాత్రం గాయం అయినా అతడి ప్రాణాలు పోయేవని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు వారాల పాటు అతడి జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందన్నారు. -
అణువణువూ ఆరోప్రాణమై!
గ్రేట్ లవ్ స్టోరీస్ చైనాలోని షాన్‌డోంగ్ ప్రావిన్స్‌లో ఉన్న చిన్న గ్రామం సుంజియాయు మొత్తం పెళ్లి కళతో సందడిగా ఉంది. అలా అని అక్కడ సామూహిక వివాహాలేమీ జరగడం లేదు. బొగ్గుగనిలో పనిచేసే ‘డూ యున్ఫా’ పెళ్లి మాత్రమే జరుగుతోంది. సాధారణంగా ఒక ఇంట్లో పెళ్లి జరిగితే... ఆ ఇంట్లో మాత్రమే చుట్టాలు పక్కాల సందడి ఉంటుంది. కానీ యున్ఫా పెళ్లికి ఊరు ఊరంతా సందడి నెలకొంది. ఊరి వాళ్లంతా చుట్టాలయ్యారు. ఎందుకంటే అతడు అందరివాడు. మనసున్నవాడు. కొందరు యున్ఫాను సరదాగా ఆట పట్టిస్తున్నారు. కొందరు మాత్రం అతడి గురించి జాలిగా మాట్లాడు కుంటున్నారు. ‘మన యున్ఫా ఉత్త అమాయకుడిలా ఉన్నాడు. సన్యాసి సన్యాసి రాసుకుంటే ఏమొస్తుంది? బూడిద తప్ప!’ ‘ఏం అలా అంటున్నావు?’ ‘లేకపోతే ఏంటి? వీడి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. వీడికంటే ఒక మెట్టు పైనున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నిశ్చింతంగా ఉండొచ్చు కదా!’ ‘అవుననుకో. అందరూ మనలాగే ఆలోచించరు కదా. ఆ అమ్మాయి వాడికి బాగా నచ్చుంటుంది.’ చాలామంది ఇలాగే చర్చిస్తున్నారు. కానీ యున్ఫా అవేమీ పట్టించుకోవడం లేదు. ‘‘అందరూ మాటలతో ప్రేమలో పడతారు. నేను మాత్రం ఆ అమ్మాయి మూగకళ్లను చూసి ప్రేమలో పడిపోయాను’’ అంటూ యూయైని చూసిన తొలి క్షణాల గురించి స్నేహి తులతో చెప్తున్నాడు. పెళ్లికూతురిని చూస్తూ జానపద పాటలు కూడా పాడాడు. ఊరు ఊరంతా ‘ఇది మా ఇంటి పెళ్లి’ అనుకోవడంతో పెళ్లి ఘనంగా జరిగింది. అయిదు నెలల తరువాత... పై అధికారి నుంచి పిలుపు రావడంతో యున్ఫా ఉన్నపళంగా ఆయన క్యాబిన్లోకి వెళ్లాడు. ‘‘మీ ఆవిడకు ఆరోగ్యం బాలేదని ఇంటి నుంచి వార్త వచ్చింది’’... చెప్పాడు అధికారి. యున్ఫాకు కాళ్లూ చేతులూ ఆడలేదు. మెరుపువేగంతో బయలుదేరాడు. కన్ను మూసి తెరిచేలోగా ఇంట్లో వాలిపోయాడు. ఏమైందో ఏమిటో... అవయవాలన్నీ చచ్చుబడి లేవలేని స్థితిలో ఉంది యూయై. మాట కూడా రావడం లేదు. దీనంగా భర్త వైపు చూసింది. యున్ఫా ఆమెను తీసుకుని ఆస్పత్రికి పరుగెత్తాడు. అలా ఎన్నో నెలల వరకు ఆమెను ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిప్పుతూనే ఉన్నాడు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నారు డాక్టర్లు. పైగా కాలేయం, కిడ్నీలు కూడా బాగా పాడైపోయాయని చెప్పారు. యున్ఫాకి పిచ్చి పట్టినట్టయ్యింది. ఆమెకేమైనా అయితే తాను బతకలేడు. ఎలాగైనా తనను బతికించుకోవాలి. అందుకే వైద్యం కోసం ఉన్న పొలం అమ్మాడు. అప్పులు చేశాడు. ఫలానా మొక్కతో వ్యాధి నయం అవుతుందని ఎవరో చెబితే దాని కోసం అడవుల వెంట తిరిగాడు. పాము కాట్లకు గురై ప్రాణాల మీదికి కూడా తెచ్చు కున్నాడు. కానీ ఎన్ని కష్టాలు పడినా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఒకరోజు ఆ ఊరి పెద్ద యున్ఫాతో అన్నాడు... ‘‘పెళ్లై ఆరునెలలు కూడా అవ్వలేదు. అంతలోనే ఇలా అయింది. నువ్వు మరో పెళ్లి చేసుకోవడం మంచిది. లేకుంటే ఈ అమ్మాయి సేవలోనే నీ జీవితం వ్యర్థమైపోతుంది.’’ మిగిలినవాళ్లు కూడా ఆయనకు వంత పాడారు. ‘‘యూయైని ఆమె తల్లి దండ్రులకు అప్పగించు. వైద్యానికి నెలకు కొంత సొమ్ము ఇవ్వు. నువ్వు మళ్లీ పెళ్లి చేసుకో. లేకపోతే నీ జీవితం నరకప్రాయ మవుతుంది’ అని చెప్పారు. నిజానికి యున్ఫాకి ఆ ఊరి వాళ్ల మాట వేదం. అందులోనూ పెద్దలు ఒక మాట చెబితే కాదనడు. కానీ ఆ రోజు మాత్రం వారి మాట వినలేదతను. ‘నేనలా చేయలేను’ అన్నట్లుగా చూశాడు. దీనంగా తనవైపే చూస్తోన్న యూయై కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ... ‘‘కంగారు పడకు. నేను నిన్ను విడిచి ఎక్కడికీ వెళ్లను’’ అన్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రమాణం చేశాడు. మరుసటి రోజే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు యున్ఫా. ఓ తల్లిలాగా అక్కున చేర్చుకుని యూైయెుకి సేవలు చేయడం మొదలు పెట్టాడు. అలా ఆరు దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు ఇప్పటికీ కరుణించలేదు. యూయెు పరిస్థితి ఏం మారలేదు. అలానే ఉంది. కానీ ఊరివాళ్లు మాత్రం చాలా మారారు. ఆ దంపతులను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. వారికి తమవంతు సహాయం అందిస్తున్నారు. నిజమైన ప్రేమకు నిర్వచనంలా నిలిచిన ఆ ఇద్దరికీ చివరి వరకూ అండగా నిలబడాలని నిశ్చయించుకున్నారు. - యాకూబ్ పాషా -
కుక్కల పెంపకంపై నిషేధం.. పెంచితే కాల్చివేత
బీజింగ్: తూర్పు చైనాలోని ఓ జిల్లా యంత్రాంగం కుక్కుల పెంపకాన్ని నిషేధించింది. ఇళ్లలో ఉన్న పెంపుడు కుక్కలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ఉంచుకుంటే, ఇళ్లలోకి వచ్చి కుక్కులను అక్కడికక్కడే కాల్చివేస్తామని అధికారులు హెచ్చరించారు. సెప్టెంబర్ 10 లోగా కుక్కలన్నింటీని తొలగించాలని గడువు విధించారు. షాన్‌డాండ్ ప్రావిన్స్‌లోని డయాంగ్ జిల్లా యంత్రాంగం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జంతు ప్రేమికులు ఈ నిర్ణయంపై నిరసన తెలియజేసినా జిల్లా యంత్రాంగం ఖాతరు చేయడం లేదు. లైసెన్స్ ఉన్న వారు కూడా కుక్కలను పెంచుకోరాదని ఆంక్షలు విధించింది. జిల్లాలో పరిశుభ్రత, ప్రజల శ్రేయస్సు కోసం ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. ఇంతకుమించి కారణాలు చెప్పలేదు. కాగా డయాంగ్ జిల్లా యంత్రాంగం పెంపుడు కుక్కలను నిషేధించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. చాలా మందికి పెంపుడు కుక్కలున్నాయని, లైసెన్స్‌లు కూడా కలిగి ఉన్నారని చెప్పారు. తన ఇంట్లోకి వచ్చే అధికారం అధికారులకు లేదని, తన కుక్కను ఎలా చంపుతారో చూస్తానని డయాంగ్ జిల్లా వాసి అన్నాడు.