బోర్ కొట్టి.. డాడీ మనీ అంతా ధ్వంసంచేశాడు!
న్యూఢిల్లీ : చిన్న పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్తే ఎంత ప్రమాదమో మరోసారి రుజువైంది. అయితే ఈసారి కాస్త భిన్నంగా, తండ్రికి షాకిచ్చేలా ఓ చైనా పిల్లోడు అల్లరిఅల్లరి చేశాడు. బోర్ కొట్టిన ఆ పిల్లోడు ఇంట్లో తండ్రి దాచిన పెట్టిన లక్షల కొద్దీ నగదును ధ్వంసం చేశాడు. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ క్వింగ్డావోలోని గావ్ అనే వ్యక్తికి ఇంటికి వెళ్లగానే ఓ టెర్రిబుల్ సర్ ప్రైజ్ ఎదురైంది. తన ఐదేళ్ల కొడుకు తాను దాచిపెట్టిన నగదునంతా ముక్కలు ముక్కలుగా చించేసి, కనిపించాడు. మొత్తం 50వేల యువాన్లు అంటే 4,70,000 మేర నగదు ధ్వంసం చేశాడు.
వెంటనే వాటిని తీసుకుని గావ్ బ్యాంకు వద్దకు ఎక్స్చేంజ్ కోసం పరిగెత్తినా లాభం లేకపోయింది. బ్యాంకు వారు కూడా వాటిని తీసుకోవడానికి నిరాకరించారు. సింపుల్ గా ఆ చిరిగిపోయిన నోట్లను ఎక్స్చేంజ్ గా తీసుకోవడానికి సమ్మతించమని చెప్పేశారు. కొంచెం అతికిపెట్టి తీసుకొచ్చినా వాటిని తీసుకుంటామని బ్యాంకు వారు తెలిపారు. బిజినెస్ కోసం క్రెడిటార్ల దగ్గర్నుంచి రావ్ ఈ నగదును తీసుకొచ్చాడు. అయితే ఈ విషయంలో తన కొడుకుని తప్పు పట్టాల్సినవసరం లేదని, తన కొడుకు చాలా చిన్నవాడని, అతను ఏమి చేస్తున్నాడో తనకే తెలియదని తండ్రి చెప్పాడు.