Earthquake In Eastern China Knocks Down Houses And Many Injured - Sakshi
Sakshi News home page

చైనాలో భారీ భూకంపం.. కూలిన భవనాలు.. 21 మందికి గాయాలు  

Published Mon, Aug 7 2023 7:59 AM | Last Updated on Mon, Aug 7 2023 8:50 AM

Earthquake In Eastern China Knocks Down Houses And Many Injured  - Sakshi

బీజింగ్: చైనా తూర్పు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 5.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సంస్థ వెల్లడించింది. ప్రమాదంలో డజన్ల కొద్దీ భావనాలు నేలమట్టం కాగా 21 మంది మరణించినట్టు  మీడియా వర్గాలు తెలిపాయి. 

దక్షిణ షెజోలోని శాండోంగ్ ప్రావిన్స్ లో ఆదివారం తెల్లవారుజాము 2.33 గంటలకు సంభవించిన ఈ భూకంపం ఉపరితలానికి 10కి.మీ. లోతున పుట్టిందని, సుమారు 26 కిలోమీటర్ల మేర ఇది ప్రభావం చూపిందని తెలిపింది యూఎస్ జియోలాజికల్ సంస్థ. భూకంపం తీవ్రతకు కనీసం 126 భవనాలు కుప్పకూలిపోయినట్లు తెలిపాయి శాండోంగ్ అధికారిక బృందాలు. 

కూలిన భవనాలు, గోడలతో రోడ్ల మీద ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న శిధిలాలే కనిపిస్తున్నాయి. ఈ విపత్తులో భూమి సుమారుగా 52 సార్లు కంపించడంతో సుమారుగా 21 మంది తీవ్రంగా గాయపడ్డారని, శిధిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చన్నారు అధికారులు. ఇంతవరకు ఎటువంటి ప్రాణ నష్టమైతే జరగలేదని వారు స్పష్టం చేశారు.    

చాలా దశాబ్దాల తర్వాత చైనాలో ఈ స్థాయిలో భూకంపం చోటు చేసుకుందని దీని తీవ్రత కూడా జనాన్ని భయభ్రాంతులకి గురిచేసిందని స్థానికులు చెబుతున్నారు. భూకంపం సమయంలో తల తిరుగుతున్నట్లు అనిపించిందని ఒకరు సోషల్ మీడియాలో తెలపగా.. మరొకరు భూకంపం అదురుకు గుండె జారినట్లైందని వెంటనే భయంతో రోడ్ల మీదకు పరుగులు తీసినట్లు తెలిపారు. 

భూకంపం తాలూకు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు. ఈ  వీడియోలు చూస్తేనే ఒళ్ళు  గగుర్పొడుస్తోంది. చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించి శాండోంగ్ కు సహాయాక బృందాలను పంపగా వారు సహాయక చర్యలకు ఉపక్రమించారు. అసలే భారీ వర్షాలతోనూ, వరదలతోనూ కొట్టుమిట్టాడుతున్న చైనాను ఈ భూకంపం మరింత కుదిపేసింది.     

ఇది కూడా చదవండి: పాకిస్తాన్ వధువు, భారత వరుడు.. మరో జంట కథ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement