mis fire
-
ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరి పేలిన చైనా రాకెట్
లాంచ్‌ప్యాడ్ వద్ద ఉంచిన ఓ రాకెట్ ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరి పేలిపోయిన ఘటన చైనాలో చోటుచేసుకొంది. అయితే పర్వత ప్రాంతంలో ఈ రాకెట్ పడిపోవడంతో నష్టం తప్పింది. Chinas kommerzielle Trägerrakete Tianlong-3 ist bei einem Teststart abgestürzt.#China #XiJinping #Rocket #Space #SecretStory #Taiwan #Breaking #news #Explosion #USA pic.twitter.com/uIqaCFZHVG— Brennende Frage (@brennende_frage) July 1, 2024బీజింగ్ తియాన్‌లాంగ్ టెక్నాలజీ అండ్ కో సంస్థ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. తాము అభివృద్ధి చేస్తున్న తియాన్‌లాంగ్3 అనే రాకెట్ తొలి దశ భాగం ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపోయిందని, గాంగ్యీ పర్వత ప్రాంతంలో భారీ పేలుడుతో పడిపోయిందని వెల్లడించింది. అయితే అక్కడ జనావాసాలు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.పేలుడు తర్వాత అగ్నిమాపక బృందాలు ఆ మంటల్ని ఆర్పేశాయి. తాజాగా దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.చైనాలో రాకెట్ ప్రయోగ రంగంలోకి ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇచ్చారు. దీంతో పలు కంపెనీలు తమ ప్రయోగశాలలను ఏర్పాటుచేశాయి. తియాన్‌లాంగ్3 రాకెట్‌ను చైనా స్కైడ్రాగన్ 3 పేరిట అభివృద్ధి చేస్తోంది.ఇదిలా ఉంటే.. జూన్ 22న చైనా సిచువాన్ ప్రావిన్స్‌లో ఓ గ్రామంపై రాకెట్ శిథిలాలు కూలాయి. షీఛాంగ్ శాటిలైట్ సెంటర్ నుంచి లాంగ్‌మార్చ్2 రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే అవి జనావాసాలపై పడ్డాయి. -
గన్ మిస్ ఫైర్..హెడ్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ గన్ మిస్‌ఫైర్ అయి తీవ్ర గాయాలతో మృతి చెందిన సంఘటన హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లా గరిడెపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన 12వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ (పీసీ–1769) శ్రీకాంత్ (29) హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఖబూతర్‌ఖానా ఔట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. 2018 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్ రెండున్నర సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి నైట్ డ్యూటీలో ఉండి..ఔట్ పోస్టులో నిద్రిస్తుండగా పక్కనే ఉన్న గన్ మిస్‌ఫైర్ కావడంతో గొంతుకు గాయమైంది. దీంతో శ్రీకాంత్‌ను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు ఉన్నతాధికారులు ఉస్మానియాకు చేరుకొని వివరాలను సేకరించారు. మూడు నెలల క్రితం కోదాడ ప్రాంతానికి చెందిన యువతితో శ్రీకాంత్‌కు వివాహం నిశ్చయమైందని, వచ్చే ఏడాది వేసవిలో వివాహం జరగాల్సి ఉందని, అంతలోనే ఇలా జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు విలపించారు. -
పెళ్లి ఊరేగింపు: దోస్తును కాల్చి చంపిన పెళ్లికొడుకు
మన పెళ్లిళ్లకు హడావిడి మామూలుగా ఉండదు. అయితే.. ఆర్భాటాలు, దర్పం ప్రకటించుకునే క్రమంలో అతిపోకడలకు పోతుండడంతో.. అనర్థాలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వివాహ వేడుకలో విషాదం నింపింది. తన స్నేహితుడినే కాల్చి చంపేశాడు ఓ పెళ్లి కొడుకు. పెళ్లి ఊరేగింపులో తన చిన్ననాటి స్నేహితుడినే కాల్చి చంపేశాడు పెళ్లి కొడుకు. అయితే అది పొరపాటుగానే జరిగింది. ఉత్తర ప్రదేశ్ సోన్‌భద్ర జిల్లా బ్రహ్మనగర్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఘటనలో టైంలో కొందరు వీడియోలు తీయగా.. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మనీష్ మదేషియా అనే వ్యక్తి వివాహంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. మనీష్ స్నేహితుడు బాబూ లాల్ యాదవ్ ఆర్మీలో జవాన్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి కొడుకు రథంపై ఊరేగింపు టైంలో.. తన దగ్గరి గన్నే మనీష్ చేతిలో పెట్టి గాల్లోకి కాల్పులు జరపమన్నాడు బాబూ లాల్. అయితే.. గాల్లోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన మనీష్.. గన్ను కిందకు దించగానే ట్రిగ్గర్ నొక్కుకుపోయి బుల్లెట్ బాబూ లాల్ శరీరంలోకి దూసుకుపోయింది. బాధితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఘటనకు సంబంధించి మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త పెళ్లి కొడుకు మనీష్ మేదషియాను అరెస్ట్ చేశారు. అలాగే మరో ఐదుగురిపైనా అభియోగాలు నమోదు అయ్యాయి. నేరం రుజువైతే మనీష్‌కు రెండు నుంచి ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. మన దేశంలో వివాహ తదితర వేడుకలు, ప్రార్థన స్థలాలు సహా బహిరంగ ప్రాంతాల్లో లైసెన్స్ తుపాకులతో కాల్పులు జరిపినా.. చట్టరీత్యా నేరం. दूल्हे ने की हर्ष फायरिंग, आर्मी के जवान की हुई मौत। यूपी के @sonbhadrapolice राबर्ट्सगंज का #ViralVideo #earthquake #breastislife #fearwomen #Afghanistan pic.twitter.com/7laX9OUIqD — RAHUL PANDEY (@BhokaalRahul) June 23, 2022 थाना रॉबर्ट्सगंज पुलिस द्वारा हर्ष फायरिंग में हुई हत्या से सम्बन्धित 01 नफर अभियुक्त को किया गिरफ्तार, कब्जे से आलाकत्ल 01 अदद पिस्टल मय 04 अदद जिन्दा व 01 अदद फायरशुदा कारतूस बरामद । pic.twitter.com/8gfevb7r96 — Sonbhadra Police (@sonbhadrapolice) June 22, 2022 -
భారత్ మిస్సైల్ మిస్‌ఫైర్.. ‘యాక్షన్ వేరేలా ఉండేది.. కానీ, కామ్‌గా ఉన్నాం’
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ మిస్సైల్ మిస్‌ఫైర్ వివాదంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి స్పందించారు. ఆ ఘటన జరిగిన వెంటనే తమ దేశం ఘాటుగా ప్రతిస్పందించగలిగేదని అన్నారు. అయితే.. అలా చేయకుండా తమ వైఖరికి భిన్నంగా ఓపిక పట్టామని చెప్పారు. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను, దేశాన్ని శక్తిమంతం చేసుకుంటామని పేర్కొన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని హఫీజాబాద్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ పైవిధంగా స్పందించారు. కాగా, మార్చి 9న భారత్‌కి చెందిన సూపర్-సోనిక్ ఫ్లయింగ్ క్షిపణి సూరత్‌గఢ్ నుంచి పాకిస్తాన్ భూభాగంవైపు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్ చున్ను నగర సమీపంలో అది కూలింది. అయితే, ఈప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమీపంలోని గోడ మాత్రం ధ్వంసమైంది. దీనిపై భారత రక్షణ శాఖ ఇప్పటికే వివరణ ఇచ్చింది. సాధారణ నిర్వహణ ప్రక్రియ జరగుతుండగా ప్రమాదవశాత్తు పాకిస్థాన్‌వైపు క్షిపణి దూసుకుపోయిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. (చదవండి: బ్రహ్మోస్ మరింత శక్తివంతం) ఈ క్షిపణి పాకిస్తాన్లో ల్యాండ్ అవ్వడానికి ముందు గగనతలంలో సుమారు 100 కి.మీ పైగా వేగంతో దాదాపు 40 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిందని పేర్కొంది. సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందని తీవ్ర విచారం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక భారత్ స్పందనపై పాకిస్తాన్ విదేశాంగశాఖ కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ వివరణ సరిగా లేదని, ఘటనపై ఉమ్మడి దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. అనుకోని ప్రమాదమే అయితే, క్షిపణి లాంచ్ కాగానే వెంటనే చెప్పాలి కదా! అని ప్రశ్నించింది. (చదవండి: మాటలు జాగ్రత్త! తేడా వస్తే అంతే.. ఇలా వచ్చి అలా తలపై కోడిగుడ్డుతో...) -
అమాయక కూలీలపై పేలిన ఆర్మీ తూటా
కోహిమా/గువాహటి/న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో దారుణం జరిగింది. తీవ్రవాదుల ఏరివేత ఆపరేషన్ గురి తప్పింది. బొగ్గు గనిలో పని పూర్తిచేసుకొని పాటలు పాడుకుంటూ వాహనంలో ఇళ్లకు తిరిగి వస్తున్న కార్మికులపై సైనికులు తుపాకులు ఎక్కుపెట్టారు. కాల్పుల్లో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమయం గడుస్తున్నా ఇంటికి చేరుకోని తమవారిని వెతుకుతూ గ్రామస్థులు బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక కంటిముందు కనిపించిన రక్తపాతాన్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. అక్కడే ఉన్న మిలటరీ వాహనాలను చుట్టుముట్టి, నిప్పు పెట్టారు. జవాన్లపై దాడికి దిగారు. అప్రమత్తమైన జవాన్లు ఆత్మరక్షణ కోసం తుపాకులకు మళ్లీ పనిచెప్పారు. ఈసారి మరో ఏడుగురు పౌరులు ప్రాణాలొదిలారు. గ్రామస్థుల దాడిలో ఒక జవాను మరణించాడు. సైనికుల కాల్పుల్లో మొత్తం 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మోన్ జిల్లాలోని తిరూ ఏరియాలో ఓతింగ్ గ్రామం వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మరొకరి మృతి సైనికుల కాల్పులు, పేదల మరణంపై ఆదివారం నాగాలాండ్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనం వీధుల్లోకి వచ్చారు. సైన్యం అకృత్యానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. 17 మందిని పొట్టనపెట్టుకున్న జవాన్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోన్ జిల్లాలో కోన్యాక్ యూనియన్ ఆఫీసు, అస్సాం రైఫిల్స్ క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయంలోని పలు భాగాలను దహనం చేశారు. వారిని అడ్డుకోవడానికి భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నాగాలాండ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. తప్పుడు సమాచారం, వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందకుండా మోన్ జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయినప్పటికీ కార్యాలయాల విధ్వంసానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 17 మంది మృతదేహాలకు మోన్ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం అస్సాంకు తరలించినట్లు చెప్పారు. ‘సిట్’ ఏర్పాటు తాజా సంఘటనపై విచారణ కోసం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందానికి నాగాలాండ్ ఐజీ నేతృత్వం వహిస్తున్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని, రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని సీఎం నీఫియూ రియో విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించరాదని కోరారు. సైనికుల కాల్పుల ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణేకు ఉన్నతాధికారులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. 17 మంది మరణించడం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం ప్రకటించారు. వారి కుటుం బాలకు ట్విట్టర్లో సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. హార్న్‌బిల్ ఫెస్టివల్ బహిష్కరిస్తున్నాం పౌరులపై సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరపడాన్ని ఈస్ట్రర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్‌పీఓ) ఖండించింది. ఈ సంఘటనకు నిరసనగా హార్న్‌బిల్ ఫెస్టివల్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫెస్టివల్లో పాల్గొనరాదంటూ స్థానిక గిరిజన తెగలకు పిలుపునిచ్చింది. నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలపాలంది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్శించడానికి నాగాలాండ్ ప్రభుత్వం ప్రస్తుతం హార్న్‌బిల్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మోన్ జిల్లా పొరుగు దేశమైన మయన్మార్‌తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది. ఎన్ఎస్సీఎన్–కేలోని యుంగ్ ఆంగ్ ముఠా ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. అసలేం జరిగింది? నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–ఖప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే) అనే తీవ్రవాద సంస్థలో ఒక భాగమైన యుంగ్ ఆంగ్ ముఠా సభ్యులు తిరూ ఏరియాలో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న సైనికులు గాలింపు చర్యలు ప్రారంభించారు. పని ముగించుకొని వాహనంలో వస్తున్న కార్మికులను ఎన్ఎస్సీఎన్–కే తీవ్రవాదులుగా భ్రమపడి, కాల్పులు జరిపారు. చిన్న పొరపాటు భారీ హింసాకాండకు దారితీసింది. రెండుసార్లు జరిగిన కాల్పుల్లో మొత్తం 17 మంది బడుగు జీవులు బలయ్యారు. ఒక జవాను సైతం ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం పరిణామాలపై ‘కోర్టు ఆఫ్ ఎంక్వైరీ’ కోసం ఆదేశాలు జారీ చేసినట్లు సైన్యం ప్రకటించింది. జనం దాడిలో తమ సైనికులు కొందరు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది. 17 మంది సాధారణ ప్రజలు చనిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకర సంఘటన అని పేర్కొంది. కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది? ‘‘నాగాలాండ్‌లో సైన్యం కాల్పులపై కేంద్ర ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాలి. సొంత దేశంలోనే పౌరులకు, భద్రతా సిబ్బందికి రక్షణ లేని పరిస్థితి ఉంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది. 17 మంది పౌరుల మరణం నా హృదయాన్ని కలచివేసింది’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ సమగ్ర దర్యాప్తు జరపాలి ‘‘నాగాలాండ్‌లో సైన్యం కాల్పుల్లో పౌరుల మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి -
తుపాకీ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
తిరుపతి క్రైమ్: తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో తిరుపతి ప్రత్యేక జైలులో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. వెస్ట్ సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని ఏఆర్ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మీనారాయణరెడ్డి (47) ఏడాది నుంచి సబ్ జైలు వద్ద గార్డుగా పనిచేస్తున్నాడు. లక్ష్మీనారాయణరెడ్డి ఎప్పటిలానే శనివారం సాయంత్రం 6.00 గంటలకు డ్యూటీ ముగించుకున్నాడు. ఇంటికి వెళ్లేందుకని బట్టలు మార్చుకునే సమయంలో తుపాకీ (303 రైఫిల్) పక్కన పెడుతుండగా మిస్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ గుండెలోకి దూసుకు వెళ్లడంతో లక్ష్మీనారాయణరెడ్డి అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. -
మిస్‌ఫైర్‌తో కానిస్టేబుల్‌కు గాయాలు
ఉండవల్లి : గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఫైరింగ్ రేంజ్లో అపశృతి చోటు చేసుకుంది. శిక్షణలో భాగంగా మంగళవారం ఉదయం యాంటీ నక్సల్ స్క్వాడ్‌కు చెందిన కానిస్టేబుల్ అల్లం ఆనందరావు తుపాకీతో ఫైరింగ్ చేయగా బుల్లెట్ ఎదురుగా ఉన్న ఇనుప కమ్మీకి తగిలి తిరిగి వెనక్కి వచ్చి అతడి శరీరంలోకి దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడటంతో సిబ్బంది అతడిని గుంటూరు సమీపంలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆనందరావు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.