మిస్‌ఫైర్‌తో కానిస్టేబుల్‌కు గాయాలు | constable injured due to mis fire | Sakshi
Sakshi News home page

మిస్‌ఫైర్‌తో కానిస్టేబుల్‌కు గాయాలు

Published Tue, May 12 2015 3:19 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

constable injured due to mis fire

ఉండవల్లి : గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఫైరింగ్ రేంజ్‌లో అపశృతి చోటు చేసుకుంది. శిక్షణలో భాగంగా మంగళవారం ఉదయం యాంటీ నక్సల్ స్క్వాడ్‌కు చెందిన కానిస్టేబుల్ అల్లం ఆనందరావు తుపాకీతో ఫైరింగ్ చేయగా బుల్లెట్ ఎదురుగా ఉన్న ఇనుప కమ్మీకి తగిలి తిరిగి వెనక్కి వచ్చి అతడి శరీరంలోకి దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడటంతో సిబ్బంది అతడిని గుంటూరు సమీపంలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆనందరావు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement