తుపాకీ మిస్‌ఫైర్‌.. హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి | Head Constable killed with Gun misfire | Sakshi
Sakshi News home page

తుపాకీ మిస్‌ఫైర్‌.. హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

Published Sun, May 9 2021 4:53 AM | Last Updated on Sun, May 9 2021 10:43 AM

Head Constable killed with Gun misfire - Sakshi

తిరుపతి క్రైమ్‌: తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో తిరుపతి ప్రత్యేక జైలులో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. వెస్ట్‌ సీఐ శివప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని ఏఆర్‌ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణరెడ్డి (47) ఏడాది నుంచి సబ్‌ జైలు వద్ద గార్డుగా పనిచేస్తున్నాడు. లక్ష్మీనారాయణరెడ్డి  ఎప్పటిలానే శనివారం సాయంత్రం 6.00 గంటలకు డ్యూటీ ముగించుకున్నాడు.

ఇంటికి వెళ్లేందుకని బట్టలు మార్చుకునే సమయంలో తుపాకీ (303 రైఫిల్‌) పక్కన పెడుతుండగా మిస్‌ ఫైర్‌ అయ్యింది. బుల్లెట్‌ గుండెలోకి దూసుకు వెళ్లడంతో లక్ష్మీనారాయణరెడ్డి అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement