బీజింగ్: చైనాకు చెందిన లూనార్‌ల్యాండర్ చాంగే-6 చంద్రునిపై మనకు కనిపించని అవతలి వైపు ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. చైనా కాలమానం ప్రకారం ఆదివారం(జూన్2) ఉదయం అయిట్కిన్ బేసిన్ అనే పేరుతో పిలుచుకునే ప్రాంతంలో చాంగే-6 సురక్షితంగా దిగినట్లు తెలిపింది.
చాంగే-6 అక్కడి శాంపిల్స్ తీసుకున్న తర్వాత తిరిగి భూమికి బయల్దేరనుండటం విశేషం. మే3వ తేదీన చాంగే-6 భూమి నుంచి బయలుదేరి 53 రోజులు ప్రయాణించి చంద్రున్ని చేరింది. రోబోల సాయంతో చంద్రునిపై తవ్వకాలు జరిపి రెండు కిలోల మట్టి శాంపుల్స్ తీసుకోనుంది.
తర్వాత లూనార్ ల్యాండర్‌లోని అసెండర్ మాడ్యూల్ చంద్రుడిపైకి లేచి చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్‌తో అనుసంధానమవతుంది. ఆర్బిటర్ మళ్లీ భూమి దిశగా ప్రయాణం మొదలు పెడుతుంది. ఆర్బిటర్‌లోని రీఎంట్రీ మాడ్యూల్ శాంపుల్స్ తీసుకుని భూమిపైన దిగుతుంది.
చంద్రుడి అవతలివైపు మొత్తం గోతులతో నిండి ఉండటం వల్ల అటువైపు ల్యాండ్ అయి వ్యోమనౌకలు తిరిగి రావడం అంత సులువు కాదు. అయితే చైనా ఈ ఫీట్‌ను సాధిస్తే 2030లో చంద్రునిపై వ్యోమగాములను పంపేందుకు మార్గం సుగమం అయినట్లే.
Comments
Please login to add a commentAdd a comment