బీజింగ్ : ఇంటర్నెట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం చైనా మంగళవారం రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. జిన్‌గున్ 2 01, జిన్‌గున్02 అనే రెండు ఉపగ్రహాలను .. కువజువా-1ఏ (కేజెడ్-1ఏ) రాకెట్ ద్వారా ప్రయోగించారు. వాయువ్య చైనాలోని జుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. విజయవంతంగా ఆ రెండు ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. జిన్‌గున్ శాటిలైట్ కంపెనీ.. ఆ రెండు ఉపగ్రహాలను డెవలప్ చేసింది. అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ సేవలపై ఆ శాటిలైట్లు ప్రయోగాలు చేపడుతాయి. ఐఓటీ అప్లికేషన్స్‌పై పైలట్ పరిశోధన చేపట్టనున్నాయి. లో ఆర్బిట్ స్మాల్ శాటిలైట్లను నింగిలోకి పంపేందుకు కేజెడ్-1ఏ రాకెట్‌ను వాడుతారు.
Comments
Please login to add a commentAdd a comment