

చూడటానికి చాలా కొత్తగా కనిపించే రాకెట్ వన్.. వేవ్ మోషన్ గన్ లాగా కనిపించే భారీ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ పొందుతుంది.

డౌన్‌వర్డ్ యాంగిల్, క్లిప్ ఆన్ స్టైల్ హ్యాండిల్‌బార్లు, స్కూప్-ఇన్ సింగిల్ సీట్, బ్రెంబో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు ఇందులో ఉన్నాయి.

ఎలక్ట్రిక్ రాకెట్ వన్ 180 హార్స్‌పవర్ & 1,200 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రాకెట్ వన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిమీ దూరం ప్రయాణించగలదు.

కంపెనీ ఈ బైక్ కోసం ప్రత్యేకమైన హెల్మెట్ కూడా రూపొందించింది. హెల్మెట్ హెడ్స్ అప్ డిస్‌ప్లే, బ్లూటూత్ ఆడియో కిట్ వంటివి పొందుతుంది.








