విజయంతో ఘనంగా వీడ్కోలు
మొబైల్ లాంచర్ నుంచి సైతం అగ్ని-5 ఖండాంతర క్షిపణి తొలి సారిగా సత్తా చాటడంతో డీఆర్‌డీవో చీఫ్‌గా అవినాశ్ చందర్‌కు ఘనంగా వీడ్కోలు లభించినట్లయింది. డీఆర్‌డీవో చీఫ్‌గా శనివారం పదవి నుంచి ఆయన ఈ చివరి విజయంతో సంతృప్తిగా వైదొలిగారు. ‘డీఆర్‌డీవోలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాను. సంస్థ విజయాల్లో నాకు మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు.
దేశానికి అధునాతన క్షిపణులను అందించగలిగినందుకు తృప్తితో వీడ్కోలు తీసుకుంటున్నా’ అని చందర్ అన్నారు. అగ్ని, ఇతర క్షిపణుల అభివృద్ధిలో విశేష కృషి చేసిన ‘అగ్ని మ్యాన్’గా పేరు తెచ్చుకున్న చందర్ కాంట్రాక్టును 15 నెలలు ముందుగానే కేంద్రం రద్దుచేయడం తెలిసిందే. డీఆర్‌డీవో బాధ్యతలను రక్షణ కార్యదర్శి ఆర్‌కే మాథుర్‌కు అదనంగా కేంద్రం అప్పగించింది.